గూగల్ క్రోమ్ బ్రౌజర్ కొత్త అప్ డేట్ వెర్షన్ 45 రిలీజ్

గూగల్ క్రోమ్ బ్రౌజర్ కొత్త అప్ డేట్ వెర్షన్ 45 రిలీజ్
HIGHLIGHTS

టోటల్ బ్రౌజర్ స్పీడ్ పెరిగింది.

గూగల్ క్రోమ్ బ్రౌజర్ ఇంటర్నెట్ వాడే ప్రతీ ఒక్కరికీ ఫేవరేట్. ఇష్టం అనే కాదు బ్రౌజర్ రేకింగ్స్ 2015 లో కూడా క్రోమ్ నంబర్ 1 స్థానం లో నిలబడింది. ఆల్రెడీ బ్రౌజర్ వాడుతున్న వారు క్రోమ్ సెట్టింగ్స్ లో Help and About లో About Google Chrome లోకి వెళ్లి అప్ డేట్ చేయగలరు. క్రోమ్ కొత్తగా ఇంస్టాల్ చేయాలనుకుంటే ఈ లింక్ లో నుండి లేటెస్ట్ వెర్షన్ డౌన్లోడ్ చేయగలరు.

అయితే క్రోమ్ మాత్రం సిస్టం లో ర్యామ్ ను ఎక్కువుగా వాడుతుంది. ఎక్కువ టాబ్స్ ఓపెన్ చేస్తే ఇది ఇంకా ఎక్కువ తీసుకుంటుంది ర్యామ్. అందుకే క్రోమ్ ను స్పీడ్ గా ఎక్కువ ర్యామ్ తీసుకోకుండా ఎలా చేయాలో ఈ లోంక్ లో మీకు ఒక ఆర్టికల్ అందిచాము. చదవని వాళ్లు, ఒకసారి చూడగలరు.

ఇప్పుడు తాజగా క్రోమ్ 45 వెర్షన్ రిలీజ్ చేసింది. ఇది ప్రధానంగా ర్యామ్ వాడకాన్ని తగ్గించింది. ఇందుకు ప్రూఫ్ క్రింద గూగల్ పాత వెర్షన్ కు కొత్త వెర్షన్ 45 కంపేరిజన్ వీడియో కూడా రిలీజ్ చేసింది.

45 వెర్షన్ లో ఉన్నవి..

బ్రౌజర్ లో టాబ్ idle(వాడకుండా) ఉంటే, అటోమేటిక్ గా ఆ టాబ్ బ్యాక్ గ్రౌండ్ లో వాడుతున్న ర్యామ్ ను క్లియర్ చేసి ఫ్రీ చేస్తుంది. 10% మెమరీ వాడకాన్ని ఈ వెర్షన్ లో తగ్గించారు అని చెబుతున్నారు క్రోమ్ బృందం.

జి – మెయిల్ లో అయితే దాదాపు నాలుగు రెట్లు తక్కువ ర్యామ్ ను తీసుకుంటుంది కొత్త వెర్షన్.

గతంలో రిస్టోర్ టాబ్స్ ఆప్షన్ ఉంది. కొత్త అప్ డేట్ లో ఇది ఇంతకముందు యూజర్ టాబ్స్ ఎలా వాడారో మళ్ళీ ఓపెన్ చేస్తే అలానే ఓపెన్ అయ్యేలా కొత్త అప్ డేట్ పనిచేస్తుంది. అంటే ఎక్కువ సార్లు చూసిన టాబ్స్ ముందుగా, తరువాత సేమ్ ఆర్డర్ లో ఓపెన్ అవుతాయి.

కంప్యూటర్ లో ర్యామ్ తగ్గుతుంటే, టాబ్స్ ను ఆటోమేటిక్ గా రిస్టోర్ చేయటం ఆపుతుంది. లోడ్ తగ్గిన తరువాత యూజర్స్ manual గా రిస్టోర్ చేయగలరు.

ఇంటర్నెట్ వాడుతునప్పుడు సైట్లలో కనిపించే ఫ్లాష్ బేస్డ్ కంటెంట్ ను ఆటోమేటిక్ గా by డిఫాల్ట్ రన్ అవనివ్వదు అని అనౌన్స్ చేసింది గూగల్ దీనికి ముందే. ఇది కూడా వెబ్ సైట్ బాగా లోడ్ అయ్యేందుకు మంచి నిర్ణయం.

 

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo