Social Media అడ్డాగా కొత్తగా ట్రేడింగ్ స్కామ్ ఊపందుకుంది..జర భద్రం భయ్యా.!
Social Media అడ్డాగా కొత్తగా ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ స్కామ్ ఊపందుకుంది
చేతిలో ఉన్న డబ్బును మరింత పెంచే ఏకైక మార్గం గా ట్రేడింగ్ ఉండడమే ఇందుకు కారణం
ఇన్వెస్టర్ల వీక్ నెస్ ను సొమ్ము చేసుకునే కొత్త స్కామర్లు సోషల్ మీడియాలో తిష్ట వేసుకుని కూర్చున్నారు
ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్ట్ మెంట్ రంగం అయిన ట్రేడింగ్ చాలా వేగంగా పెరిగిపోతోంది. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు మాత్రమే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరూ కూడా షేర్ మార్కెట్ చిన్న మొత్తంలో డబ్బులు ఇన్వెస్ట్ చేసే వైపుగా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే, కొద్ది సమయంలో చేతిలో ఉన్న డబ్బును మరింత పెంచే ఏకైక మార్గం గా ట్రేడింగ్ ఉండడమే ఇందుకు కారణం. అయితే, ఇన్వెస్ట్ మెంట్ చేసే ఇన్వెస్టర్ల వీక్ నెస్ ను సొమ్ము చేసుకునే కొత్త స్కామర్లు సోషల్ మీడియాలో తిష్ట వేసుకుని కూర్చున్నారు. అందుకే, Social Media అడ్డాగా కొత్తగా ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ స్కామ్ ఊపందుకుంది.
New Scam in Social Media
ఎక్కువ రిటర్న్స్ తక్కువ సమయంలో అందించే షేర్స్ లేదా ట్రేడింగ్ యాప్ అని సోషల్ మీడియా మాధ్యమాలు అయిన ఫేస్ బుక్, వాట్సాప్ మరియు X (ట్విట్టర్) ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రజలను నమ్మించి నట్టేట ముంచేస్తున్నారు. ఇన్వెస్టర్లు నమ్మేలా అన్ని వివరాలు ఈ స్కామర్లు అందిస్తారు మరియు పూర్తిగా నమ్మి ఇన్వెస్ట్ చేస్తే, వెంటనే ముంచేస్తున్నారు.
గత కొన్ని నెలలుగా ఈ కొత్త స్కామ్ ఫేస్ బుక్, వాట్సాప్ మరియు X (ట్విట్టర్) ప్లాట్ ఫామ్స్ ద్వారా ప్రభలుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ప్రముఖ సైబర్ సెక్యూరిటీ ప్రొవైడర్ CloudSEK ఈ విషయాన్ని భయపెట్టింది. ఈ కంపెనీ అందించిన నివేదిక ప్రకారం, ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతదేశంలో ట్రేడింగ్ సంబంధిత మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు నివేదించింది.
ఇదే విషయాన్ని విస్తారంగా తెలియజేసే రిపోర్ట్ ను కూడా CloudSEK అధికారిక వెబ్సైట్ నుండి పోస్ట్ చేసింది. ఈ రిపోర్ట్ నుంచి 2023 ఇండియాలో 1 లక్షకు పైగా ఇన్వెస్ట్ మెంట్ స్కామ్ లు జరిగినట్లు తెలిపింది. అంతేకాదు, 2024 జనవరి నుంచి 2024 ఏప్రిల్ మధ్యకాలంలో నమోదమైన 4,599 ఫ్రాడ్ కేసుల ద్వారా 1.2 బిలియన్స్ నష్టపోయినట్లు కూడా తెలిపింది.
2024 జనవరి నుంచి 2024 ఏప్రిల్ మధ్య 20,043 ట్రేడింగ్ కేసులు నమోదైనట్లు, వీటి నుండి 14.2 బిలియన్ నష్టపోయినట్లు కూడా తెలిపింది. ఇది పెద్ద చైన్ సిస్టం అని, ఇది చిన్న చిన్న గ్రూప్స్ నుండి హ్యాకర్స్ వరకు చాలా పకడ్బందీగా నిర్వహించబడుతున్న నెట్వర్క్ అని కూడా చెబుతోంది. ఈ నివేదికలో, రెండు రకాల ప్రధాన ట్రేడింగ్ స్కామ్ లు ఉన్నాయని తెలిపింది. ఇందులో, క్రిప్టో స్కామ్ మరియు స్టాక్ ట్రేడింగ్ స్కామ్ ఉన్నాయి.
Also Read: Redmi కొత్త బడ్జెట్ ఫోన్ రింగ్ ఫ్లాష్ 108MP కెమెరాతో రేపు లాంచ్ అవుతుంది.!
ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?
ఈ స్కామ్ నుంచి మోసపోయిన బాధితులు మొదటగా వాట్సాప్ స్కామర్స్ నుంచి వాట్సాప్ మెసేజ్ అందుకుంటారు. తర్వాత, ట్రేడింగ్ అప్డేట్స్ కోసం వాట్సాప్ గ్రూప్ లో చేరేలా వారిని ఉసిగొల్పుతారు. గ్రూప్ లో యాడ్ అయిన తర్వాత గొప్ప లాభాలను ఇచ్చేవిగా నమ్మించే, మోసపూరితమైన ట్రేడింగ్ యాప్స్ ను ఇన్స్టాల్ చేసుకునేలా స్కామర్లు ఫోర్స్ చేస్తారు. ఈ యాప్స్ లో నకిలీ లాభాలను మరియు స్టాక్ రేట్లు చూపించి, ఎక్కువ లాభాలు వచ్చే స్టాక్స్ గా నమిస్తారు. ఈ పోర్టుఫోలియో చూసిన బాధితులు చిన్న చిన్నగా ట్రేడింగ్ మొదలు పెడతారు.
అయితే, ఎక్కువ మొత్తంలో ట్రేడింగ్ పైన ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందవచ్చని నమ్మిస్తారు. బాధితులు ఎక్కువ మొత్తం ఇన్వెస్ట్ చేసిన వెంటనే ట్రేడింగ్ నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. అప్పటికి గాని బాధితులకు అర్థం కాదు తాను మోసపోయానని. ఈ విధంగా ట్రేడింగ్ మరియు ఇన్వెస్ట్ మెంట్ యాప్స్ ద్వారా ఇన్వెస్టర్లను మోసం చేస్తున్నారు. అందుకే, మీకు తెలియని ట్రేడింగ్ యాప్ లేదా ఇన్వెస్ట్మెంట్ యాప్స్ తో తస్మాత్ జాగ్రత్త సిమి.