లక్షల కొద్ది ఆండ్రాయిడ్ యూజర్ల పర్సనల్ డేటా రిస్క్ లో ఉందంటూ ప్రముఖ యాంటీ వైరస్ కంపెనీ Dr Web తన నివేదికలో వెల్లడించింది. ఈ ఇది నేరుగా ఎటాక్ చేసే స్పైవేర్ కాదు మరియు ఈ స్పైవేర్ ద్వారా ఎఫెక్ట్ అయిన లేదా నిక్షిప్తమైన యాప్స్ ద్వారా ఈ ప్రమాదం పొంచి ఉందని తెలిపింది. వాస్తవానికి, ఇది స్పైవేర్ ఫంక్షనాలిటీ తో కూడిన ఒక ఆండ్రాయిడ్ సాఫ్ట్ వేర్ మోడ్యూల్ అని డా వెబ్ (Dr Web) తెలిపింది. ఈ నివేదిక చెబుతున్న కొత్త మరియు ఆసక్తికర విషయాలు ఏమిటో తెలుసుకుందామా.
Dr Web తన కొత్త నివేదికలో ఈ స్పైవేర్ కి సంబంధించిన విషయాలను వివరంగా తెలిపింది. దీని ప్రకారం, Android.Spy.SpinOk గా ఈ స్పైవేర్ ను పేర్కొంది మరియు దీని క్రియేటర్లు దీన్ని ఒక SDK (సాఫ్ట్ వేర్ డెవలప్మెంట్ కిట్) దీన్ని తీసుకొచ్చారు. అంటే, యాప్ డెవలపర్ లు ఈ SDK ను వారి యాప్ లలో ఉపయోగించే అవకాశం ఉంటుంది. ఇది ప్రవేశపెట్టబడిన యాప్స్ పైన ఇది SpinOk అని కనిపించేలా రూపొందించారు. అయితే, వాస్తవానికి ఇది యూజర్ల పర్సనల్ డేటాని చోరీ చేసే ఒక స్పైవేర్.
దీని గురించి మాల్వేర్ ఎనలిస్టులు చెబుతున్న మాటలు కూడా నివ్వెర పరుస్తున్నాయి. ఎందుకంటే, ఈ స్పైవేర్ ను 100 పైగా యాప్స్ లో చేరినట్లు సూచిస్తున్నారు. ఈ నివేదిక ప్రకారం ఈ స్పైవేర్ (Android.Spy.SpinOk) ను కలిగి వున్న యాప్ లను భారీ సంఖ్యలో ఆండ్రాయిడ్ యూజర్లు డౌన్ లోడ్ చేసుకున్నట్లు కూడా చెబుతోంది. ఈ నెంబర్ ను ఊహించడానికే కష్టంగా అనిపించేలా వుంది. ఈ స్పైవేర్ ఎఫక్టెడ్ యాప్స్ లిస్ట్ లో అధిక డౌన్ లోడ్స్ సాధించిన టాప్ 10 యాప్స్ లిస్ట్ ను కూడా అందించింది.
ఈ స్పైవేర్ ను కలిగిన యాప్స్ డౌన్ లోడ్స్ ను చూస్తే, 420 మిలియన్లకు పైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు డా వెబ్ తెలిపింది. అంటే, ఈ స్పైవేర్ ను కలిగి వున్న యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకున్న ఆండ్రాయిడ్ యూజర్ల పర్సనల్ డేటా రిస్క్ లో ఉన్నట్లే.
Source: Dr.WEB