త్వరలో ఇండియాలో కొత్త మొబైల్ కనెక్షన్ తీసుకోవటానికి ఎటువంటి చార్జెస్ ను చెల్లించే అవసరాలు లేకుండా TRAI కొత్త విధానాలు ప్రవేసపెడతుంది.
ఇది ఎలెక్ట్రానిక్ ప్రూఫ్ submitting పద్దతి ద్వారా అమల్లోకి వస్తుంది. అది కూడా కేవలం ఒక్క ఆధార కార్డ్ ను ప్రూఫ్ గా ఉపయోగిస్తే చాలు.
ప్రస్తుతం కొత్త సిమ్ తీసుకోవటానికి సుమారు 150 రూ చెల్లించవలసి ఉంది. ఇది సరైన పద్దతి. మిగిలిన పద్దతిలో చాలా మంది ఫ్రీ గా కూడా తీసుకునే పరిస్థితులు ఉన్నాయి, అది వేరే విషయం.
150 రూ అనేది కస్టమర్ acquisition form లను ఫిల్ చేయటానికి అవుతుంది అని చెప్పాలి. అదే ప్రోసెస్ అంతా డిజిటల్ గా కంప్యుటర్ లో ఫార్మ్ ఫిల్లింగ్ మరియు డిజిటల్ ప్రూఫ్ మరియు సంతకాలు వస్తే కాస్ట్ కటింగ్ ఉంటుంది.
అన్నీ విధానాలను గవర్నమెంట్ ఒప్పుకున్నప్పుడు TRAI అప్పటికప్పుడు ఐడెంటిఫికేషన్ వెరిఫికేషన్ వంటివి ఆధార్ కార్డ్ ద్వారా పూర్తి చేసే ప్రోసెస్ ను తేవనుంది.
ఇది కేవలం ప్రాసెస్ ను ఫాస్ట్ గా చేయటానికే కాదు, బయట మీ ప్రూఫ్ లు తీసుకోని కొత్త సిమ్ కార్డులు ఇచ్చే వాళ్లు అదే ప్రూఫ్ తో వేరే సిమ్ కార్డ్ లు తీసుకుంటున్నారు.
సో వాళ్ళు ఇబ్బందికరమైన పనులు చేస్తే మీ ప్రూఫ్ ద్వారా ఆ సిమ్స్ తీసుకోవటం వలన ఇబ్బందికి గురైయ్యేది ప్రూఫ్ లో ఉన్న వ్యక్తులే. అని టెలికాం రేగులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) చైర్మన్ RS షర్మ తెలిపారు.