SIM Card New Rule: 10 లక్షల ఫైన్ తో కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ప్రవేశపెట్టిన కేంద్రం.!
ప్రస్తుతం కొనసాగుతున్న SIM Card Verification స్థానంలో కొత్త రూల్స్ ను కేంద్రం ప్రవేశపెట్టింది
SIM Card New Rule కొత్త రూల్స్ తో సిమ్ కార్డ్ వెరిఫికేషన్ మరింత కఠిన తరం అవుతుంది
ఈ కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ను అనుసరించని టెలికం కంపెనీలకు 10 లక్షల ఫైన్ వర్తిస్తుంది
SIM Card New Rule: ప్రస్తుతం కొనసాగుతున్న SIM Card Verification స్థానంలో కొత్త రూల్స్ ను కేంద్రం ప్రవేశపెట్టింది. ఈ కొత్త రూల్స్ తో సిమ్ కార్డ్ వెరిఫికేషన్ మరింత కఠిన తరం అవుతుంది. అయితే, కేంద్రం తెచ్చిన SIM Card New Rule తో ప్రతీ యూజర్ వెరిఫికేషన్ మరింత ఖచ్చితత్వంతో జరుగుతుంది. అంతేకాదు, ఈ కొత్త సిమ్ కార్డ్ రూల్స్ ను అనుసరించని టెలికం కంపెనీలకు 10 లక్షల ఫైన్ వర్తిస్తుంది. సిమ్ కార్డ్ వెరిఫికేషన్ కోసం ఇటీవల DoT నిర్వచించిన AI Tool ఫీచర్ వెరిఫికేషన్ సమయంలో దేశవ్యాప్తంగా చాలా SIM Cards తప్పుడు సమాచారంతో తీసుకున్నట్లు మరియు ఒకే వివరాల పైన వందల సిమ్ కార్డ్ లు ఉన్నట్లు గుర్తించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటి వరకూ టెలికం కంపెనీలు మరియు వారి అనుబంధ దుకాణదారులు కూడా కొత్త సిమ్ కార్డ్ కోసం అప్లై చేసే వారి వివరాలను అడ్రస్ తో సహా పూర్తిగా చెక్ చేయవలసి ఉంటుంది. అయితే, ఇటీవల DoT చేసిన AI Tool వెరిఫికేషన్ లో జరగడం లేదని చాలా సిమ్ కార్డ్స్ ఒకే ఫోటో లేదా వివరాలతో తీసుకున్నట్లు కూడా బయట పడింది. అందుకే కాబోలు కేంద్రం ఈ SIM Card New Rule లను ప్రవేశపెట్టింది.
SIM Card New Rule ఏమిటి?
కేంద్రం కొత్త సిమ్ కార్డ్ రూల్ ప్రకారం, ప్రతీ టెలికం కంపెనీ కూడా వారి సిమ్ కార్డ్ లను విక్రయించే అనుబంధ షాప్ ల వివరాలను వెరిఫికేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అనుమతులు లేని దుకాణధారులు ఉన్నట్లయితే వాటి మీద చర్యలు తీసుకోవాలి. అంటే, Jio, Airtel మరియు Vodafone Idea (Vi) టెలికం కంపెనీలు వారి సిమ్ కార్డ్ లను విక్రయించే దుకాణదారుల KYC ని చెక్ చెయ్యాలి. ఆ తరువాతే వారికి కొత్త సిమ్ కార్డు లను సేల్ చేసే అధికారం ఇవ్వాలి.
ఒకవేళ టెలికం కంపెనీలు అలా దుకాణదారుల KYC ని వెరిఫై చెయ్యని ఎడల ఒక్కో దుకాణానికి 10 లక్షల చొప్పున ఫైన్ విధించనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. అంతేకాదు, దుకాణదారులు కూడా SIM Card కోసం అప్లై చేసే వారిని పూర్తిగా చెక్ చెయ్యాలి లేదా భారీ భారీ మూల్యం చెల్లించాల్సి వుంటుంది. ఈ చర్య ద్వారా SIM Card Verification లో ఎటువంటి లోపాలకు తావు ఉండదు.
SIM Card New Rule ఎప్పటి నుండి అమలులోకి వస్తుంది?
కేంద్రం తీసుకొచ్చిన ఈ కొత్త SIM Card Verification రూల్ అక్టోబర్ 1 నుండి అమలులోకి వస్తుంది.