New Scam: చార్టెడ్ అకౌంటెంట్ కి మస్కా వేసి 3 లక్షలు నొక్కేసిన స్కామర్లు.!

Updated on 24-Dec-2024
HIGHLIGHTS

దేశంలో మరిన్ని కొత్త స్కామ్ లు వెలుగు చూస్తున్నాయి

కొంతమంది స్కామర్లు ఫేక్ ఆఫీసర్ ముసుగులో దోచుకుంటున్నారు

త్తగా బయట పడిన ఒక స్కామ్ మరోసారి అందరిని ఉలిక్కిపడేలా చేసింది

New Scam: దేశంలో మరిన్ని కొత్త స్కామ్ లు వెలుగు చూస్తున్నాయి. కొంతమంది స్కామర్లు క్యూఆర్ కోడ్ స్కాన్ తో స్కామ్ చేస్తుంటే, కొంతమంది స్కామర్లు ఫేక్ ఆఫీసర్ ముసుగులో దోచుకుంటున్నారు. ఇప్పుడు కొత్తగా బయట పడిన ఒక స్కామ్ మరోసారి అందరిని ఉలిక్కిపడేలా చేసింది. స్కామర్లు ఫేక్ TRAI ఆఫీసర్ ఉసుగులో 25 సంవత్సరాల చార్టెడ్ అకౌంటెంట్ నుంచి 3 లక్షలు దండుకున్నారు. హైటెక్ హంగు తో చేసిన ఈ మోసం స్కామర్లు ఎంత అప్గ్రేడ్ అయ్యారో చెప్పడానికి ఒక ఉదాహరణ అవుతుంది.

New Scam

గుజరాత్ రాష్టంలోని అహ్మదాబాద్ సిటీ లోని నరన్‌పురా ప్రాంతానికి చెందిన ఒక 25 సంవత్సరాల చార్టెడ్ అకౌంటెంట్ ఈసారి స్కామర్ల వలలో చిక్కుకున్నారు. టెలికాం అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నట్లు ఒక వ్యక్తి నుంచి కాల్ అందుకున్నారు. ఈ కాల్ లో సంభాషించిన వ్యక్తి ‘ మీ ఆధార్ కార్డ్ నెంబర్ పై అనేక సిమ్ కార్డులు తీసుకున్నారని ఇవన్నీ కూడా ఇల్లీగల్ పనులకు ఉపయోగించారని, మేటర్ చాలా సీరియస్’ అని నమ్మబలికాడు.

ఈ మాటలకు సదరు చార్టెడ్ అకౌంటెంట్ పూర్తిగా నమ్మకపోవడం తో స్కామర్ ఈ కాల్ ని మరొక ఆఫీసర్ కి కనెక్ట్ చేస్తున్నానంటూ వీడియో కాల్ ద్వారా లైన్ లోకి తీసుకున్నారు. ఆ వీడియో కాల్ లో కనిపించిన వ్యక్తి పెద్ద ఆఫీసర్ లాగా మరియు ఆ రూమంతా సెట్ అప్ తో నమ్మించే విధంగా చూపించారు.

వీడియో కాల్ చూస్తుంది మరియు మాట్లాడుతున్నది TRAI ఆఫీసర్ అని నమ్మిన సదరు చార్టెడ్ అకౌంటెంట్, తానేమి తప్పు చేయలేదని కావాలంటే వెరిఫై చేసుకోవాలి చెప్పాడు. ఇది పెద్ద కేస్ అవుతుంది మరియు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) పరిధిలోకి ఈ కేసు ఫైల్ అవుతుందని చెప్పారు. అయితే, వేరే ఇంకేదైనా మార్గం ఉంటే చెప్పండి అని ఆ చార్టెడ్ అకౌంట్ విన్నవించారు.

ఈ మాట కోసమే ఎదురుచూస్తున్న స్కామర్ వెరిఫై చేసుకోవడానికి ముందుగా కొంత అమౌంట్ డిపాజిట్ చేయాలని పూర్తి వెరిఫై చేసిన తర్వాత తిరిగి ఇస్తామని నమ్మ పలికాడు. ఇది నిజమే అని ఆ నమ్మిన చార్టెడ్ అకౌంటెంట్ రూ. 2.92 లక్షల రూపాయలు ఆన్లైన్ లో ట్రాన్స్ ఫర్ చేశారు.

డబ్బు పంపిన తర్వాత ఆ ఫోన్ నెంబర్ లేదా వ్యక్తుల వద్ద నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో తను మోసపోయినట్టు ఆ చార్టెడ్ అకౌంటెంట్ కి అర్థమైంది. విషయం అర్థమైన వెంటనే పోలీసులను సంప్రదించి కేసు రిజిస్టర్ చేశారు.

Also Read: OnePlus 13r: పవర్ ఫుల్ చిప్సెట్ మరియు వన్ ప్లస్ AI సపోర్ట్ తో వస్తోంది.!

ఫేక్ ఫోన్ కాల్స్ తో జాగ్రత్త వహించండి

అన్నింటికంటే ముందుగా మీకు వచ్చిన కాలనీ ఒకటికి రెండు సార్లు వెరిఫై చేసుకోండి. ముఖ్యంగా డబ్బు విషయంగా ఏదైనా అర్జెన్సీ చూపిస్తుంటే ఆ కాల్ ని అస్సలు నమ్మకూడదు. ఇటువంటి ఏదైనా అనుమానాస్పదం కనిపిస్తే వెంటనే లోకల్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయండి.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :