‘ఒక్క ఫోన్ కాల్’ అని అడిగారని ఫోన్ ఇచ్చారో..మీ అకౌంట్ ఖాళీ చేసేస్తారు.!

Updated on 23-Dec-2022
HIGHLIGHTS

కొత్త స్కామ్ పుట్టుకొచ్చింది తస్మాత్ జాగ్రత్త

మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు

సింపుల్ గా ఒక నంబర్ కు డయల్ చేస్తే సరిపోతుంది

దేశంలో మరొక కొత్త స్కామ్ పుట్టుకొచ్చింది తస్మాత్ జాగ్రత్త. అర్జెంటుగా ఫోన్ కాల్ చేసుకోవాలి మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? అని అడగంగానే మీ ఫోన్ ఇచ్చారో, మీ అకౌంట్ మొత్తం ఖాళీ చేసేస్తారు. ఇప్పుడు స్కామర్లు ఈ కొత్త టెక్నీక్ వాడుతున్నారు. ఇందుకు వారు ఎక్కువగా శ్రమపడవలసిన అవసరం కూడా లేదు. సింపుల్ గా ఒక నంబర్ కు డయల్ చేస్తే సరిపోతుంది. ఇటువంటి స్కామర్ల నుండి జాగ్రత్తగా ఉండాలంటే ఈ కొత్త Call Scam ఏమిటి, ఎలా పనిచేస్తుంది మరియు దాన్ని ఎలా కనిపెట్టాలో తెలుసుకోవాలి.

అసలు ఏమిటి ఈ Call Scam?

స్కామర్లు ప్రజల మంచితనాన్ని అదునుగా చేసుకొని ఈ కొత్త Call Scam ను అదునుగా చేసుకున్నారు. ఇందులో, స్కామర్లు అత్యవసరం చాలా అర్జెంటుగా కాల్ చేసుకోవాలి మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? అని అడుగుతారు. మీరు ఫోన్ ఇచ్చినట్లయితే వారు వెంటనే *21* లేదా *401* కి కాల్ చేస్తారు. అంతే, ఇక్కడ నుండి మీ ఫోన్ కాల్స్ మరియు మెసేజీలు వారి నంబర్ కి ఫార్వార్డ్ అవుతాయి.         

Call Scam తో ఏమిటి ప్రమాధం?

పైన తెలిపి విధంగా మీ ఫోన్ మెసేజీలు మరియు కాల్స్ ఫార్వార్డ్ చేస్తే, మీ ఇంపార్టెంట్ మెసేజీలు (OTP లాంటివి) మరియు కాల్స్ మరిన్ని వివరాలు స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఇంకేముంది మీ ఇన్ఫర్మేషన్ తో మీ జేబు ఖాళీ చేసేస్తారు.

మీ ఫోన్ లో ఇది ఎలా కనిపెట్టాలి?

మీకు తెలియకుండా మీ ఫోన్ లో ఎవరైనా కాల్ ఫార్వార్డింగ్ సెట్ చేశారో లేదో మీరు చాలా సులభంగా చెక్ చేయవచ్చు. దీనికోసం, మీ ఫోన్ నుండి *#62# లేదా *#67# నంబర్ కు డయల్ చేయగానే మీ ఫోన్ లో అన్ని వివరాలు చూడవచ్చు.

ఎలా నివారించాలి?

ఒకవేళ మీ ఫోన్ లో మీకు తెలియకుండా కాల్ ఫార్వార్డ్ సెట్ చేసినట్లయితే, మీరు  చాలా సులభంగా దాన్ని తొలగించవచ్చు. దీనికోసం, మీ ఫోన్ Settings లో Call > Call Forwarding లోకి వెళ్లి కాల్ ఫార్వార్డింగ్ అప్షన్ నుTurn Off చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :