Anil Ambani…. సోదరుడు ముకేష్ అంబానీ కు పోటీగా Jio ను ఎదుర్కోవటానికి కొత్త తన రిలియన్స్ నెట్ వర్క్ లో కొత్త ఆఫర్స్ ను ప్రవేశపెట్టారు.
అవును రిలయన్స్ నెట్ వర్క్ ఇంకా ఉంది. రిలయన్స్ communications వేరు, రిలయన్స్ Jio వేరు. అనిల్ అంబానీ రిలయన్స్ కమ్యునికేషన్స్(RCOM) అధినేత, ముకేష్ అంబానీ రిలయన్స్ Jio కు అధినేత.
సో RCOM సిమ్ తీసుకునే కొత్త subscribers కు welcome offer పేరుతో 50 రూ కన్నా తక్కువ 1GB 3G ఇంటర్నెట్ వస్తుంది. అయితే ఇది డైరెక్ట్ కాదు.. క్రింద ఆఫర్స్ ద్వారా ఈ pricing ఉంటుంది.
295 rs ప్లాన్ – 295 రూ పెట్టి రీచార్జ్ చేస్తే అంటే టాక్ time ప్లస్ 3GB 3G ఇంటర్నెట్ అండ్ 3 నెలలు validity తో per మినిట్ 25 paise కాల్ చార్జ్.
496 rs ప్లాన్ – 496 రూ పెట్టి రీచార్జ్ చేస్తే same 496 టాక్ టైం, 10GB 3G ఇంటర్నెట్ (ఇక్కడే 1GB కు సుమారు 50 రూ అవుతుంది) అండ్ 3 నెలలు validity తో per మినిట్ 25 paise కాల్ చార్జ్.
ఇవి పాన్ – india అంతా వర్తిస్తాయి మరియు ఎన్ని సార్లు అయినా రీచార్జ్ చేసుకోగలరు 3 నెలలో. 3 నెలలు తరువాత రెగ్యులర్ బేస్ ఆఫర్స్ ఉంటాయి అందుబాటులో.
2G కస్టమర్స్ కు కూడా 141 రూ లకు 5GB 2G డేటా ఇస్తుంది. టాక్ time 141 అండ్ 3 నెలలు validity తో per మినిట్ 25 paise కాల్ చార్జ్ ఉంది.
ఇక ఆల్రెడీ రిలయన్స్ communications లోని సిమ్స్ వాడుతున్న ప్రస్తుత కస్టమర్స్ కు కేవలం వాయిస్ లోనే ఆఫర్స్ ను ప్రవేశపెట్టింది. ఇంటర్నెట్ లో లేవు… వివరాలలోకి వెళితే..
ప్రస్తుతానికి డిల్లీ లో నాన్ స్టాప్ అనే ప్లాన్ లాంచ్ చేసింది. 153 రూ లకు 1000 లోకల్ అండ్ STD మినిట్స్ వస్తాయి. ఇదే ప్లాన్ ఆంధ్రా లో కూడా లాంచ్ అయ్యింది చిన్న డిఫరెన్స్ తో. అతి త్వరలోనే ఈ ఆఫర్ కూడా పాన్ ఇండియా మొత్తం విస్తరిస్తుంది.