Meta AI Ray-Ban Glass: స్టైల్ మరియు స్మార్ట్ కలయికతో కొత్త కళ్ళజోడు తెచ్చిన మెటా.!
స్టైల్ మరియు స్మార్ట్ కలయికతో కొత్త కళ్ళజోడు ను మెటా తీసుకు వచ్చింది
రేబాన్ తో చేయి కలిపిన మెటా ఈ కొత్త స్మార్ట్ కళ్ళ జోడును పరిచయం చేసింది
స్టైల్ గా ఉండటమే కాకుండా స్మార్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది
Meta AI Ray-Ban Glass: స్టైల్ మరియు స్మార్ట్ కలయికతో కొత్త కళ్ళజోడు ను మెటా తీసుకు వచ్చింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కళ్ళజోళ్ల బ్రాండ్ రేబాన్ తో చేయి కలిపిన మెటా, ఈ కొత్త స్మార్ట్ కాళ్ళ జోడును పరిచయం చేసింది. ఈ కళ్లజోడు చూడటానికి స్టైల్ గా ఉండటమే కాకుండా స్మార్ట్ ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది. మెటా సరికొత్తగా తీసుకు వచ్చిన ఈ మెటా ఎఐ రేబాన్ స్మార్ట్ కళ్లజోడు సంగతులు ఏమిటో చూద్దామా.
Meta AI Ray-Ban Glass
Essilor Luxottica పార్ట్నర్ షిప్ తో కొత్త సెకండ్ జెనరేషన్ గ్లాస్ లను మెటా తీసుకు వచ్చింది. ఈ కళ్ళజోడు చాలా వేగంగా అమ్ముడవు అవుతుండడంతో వీటి పరిధిని పెంచుతూ, Ray-Ban మెటా గ్లాస్ కలక్షన్ ను కూడా తీసుకు వచ్చినట్లు మెటా తెలిపింది. ఈ కొత్త కలెక్షన్ తో మరింత స్టైలిష్ లుక్ డిజైన్ తో పాటుగా Meta AI కొత్త ఫీచర్స్ లను కూడా ఇందులో జత చేసినట్లు తెలిపింది.
యూజర్లకు నచ్చిన విధంగా కస్టమైజ్ చెయ్యగల అనుకూలతతో వందల కొద్దీ డిజైన్స్ ఇందులో ఉన్నట్లు కూడా తెలిపింది. అంటే, యూజర్ కు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకొని ఈ కొత్త మెటా రేబాన్ గ్లాస్ లను పొందవచ్చు. ఈ కళ్ల జోడు లను meta.com మరియు ray-ban.com నుండి బుక్ చేసుకోవచ్చు.
ఈ కళ్ల జోడు ఇండియాలో లభిస్తుందా?
ఈ కళ్ల జోడు ఇండియాలో లభిస్తున్నాయా? అని చూసే వారికి ప్రస్తుతం నిరాశే ఎదురవుతుంది. ఎందుకంటే, ప్రస్తుతానికి ఈ మెటా రేబాన్ గ్లాస్ లు US, ఆస్ట్రేలియా, బెల్జియం, కెనడా,జపాన్ UK వంటి 15 దేశాలలో మాత్రమే అందుబాటులో వుంది.
Also Read: Internet లేకపోయినా ఫైల్ షేరింగ్ కోసం WhatsApp లో కొత్త ఫీచర్.!
Meta AI Ray-Ban Glass: ప్రత్యేకతలు
ఇక ఈ లేటెస్ట్ మెటా రేబాన్ కళ్ల జోళ్ల ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ గ్లాస్ 12 MP ultra-wide కెమేరాని కలిగి ఉంటుంది. ఇది 3024 X 4032 పిక్సెల్స్ కలిగిన ఇమేజ్ లను 1440 x 1920 పిక్సెల్స్ రిజల్యూషన్ తో 30 fps వద్ద వీడియో లను షూట్ చేయగలదు.
ఈ కళ్ల జోడులో 2x Custom-built స్పీకర్లు, కళ్ల జోడు చుట్టూ వుండే 5-mic సిస్టం మరియు ఎక్కువ BASS సపోర్ట్ ఉన్నాయి. ఈ గ్లాస్ లో Wi-Fi 6, Bluetooth 5.2 సపోర్ట్ వుంది మరియు iOS 14.2 మరియు Android 10 కంటే పైన OS డివైజ్ లతో పని చేస్తుంది.
ఇక ఇందులో అందించిన బ్యాటరీ సెటప్ విషయానికి వస్తే, ఇది రీఛార్జబుల్ బ్యాటరీ సెటప్ తో వస్తుంది. ఈ గ్లాస్ సింగల్ ఛార్జ్ తో 4 గంటలు పని చెయ్యగలదని, పూర్తి కేస్ తో 32 గంటల బ్యాకప్ అందించగలదని మెటా తెలిపింది.
ఈ మెటా రేబాన్ కళ్ల జోడుతో Livestream, వాయిస్ అసిస్టెంట్, వాట్సాప్ లో వీడియో మరియు ఆడియో కాలింగ్, మ్యూజిక్ మరియు మరిన్ని పనులను వాయిస్ కామండ్స్ తోనే చేసే వీలుంది.