BSNL ఈ ప్లాన్ లో 28GB డేటా టోటల్ గా ఫ్రీ….

BSNL ఈ ప్లాన్ లో  28GB డేటా టోటల్ గా ఫ్రీ….

ప్రైవేటు టెలికాం కంపెనీలతో పాటు, ప్రభుత్వరంగ టెలికాం సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన ప్రీపెయిడ్ వినియోగదారులకు అనేక ప్లాన్ లను  ప్రవేశపెట్టింది.BSNL ఈ ప్లాన్ ద్వారా అన్ని కంపెనీలకు పోటీని ఇస్తుంది. మరోసారి, బీఎస్ఎన్ఎల్ జియో కి కౌంటర్ గా ఒక కాంబో టారిఫ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది, ఇది మరింత డేటా ప్రయోజనంతో వస్తుంది.

జియో యొక్క 98 రూపాయల ప్లాన్ కి పోటీ గా  బిఎస్ఎన్ఎల్ 118 రూపాయల ప్రీపెయిడ్ టారిఫ్ ప్లాన్  ప్రవేశపెట్టింది. జియో యొక్క ఈ ప్లాన్ లో, వినియోగదారులు 28 రోజులపాటు మొత్తం 2 GB 4G డేటాను పొందుతారు.దీనితో పాటు, 300 SMS మరియు అపరిమిత కాల్స్ (లోకల్ , STD మరియు రోమింగ్) అందుబాటులో ఉన్నాయి.

BSNL యొక్క 118 రూపాయల ప్లాన్  కూడా 28 రోజుల వాలిడిటీ తో వస్తుంది, అందులో వినియోగదారులు మొత్తం 28 GB డేటాను పొందుతారు, అనగా 3 జి స్పీడ్ తో రోజుకు 1 GB డేటా.BSNL ఈ ప్లాన్  జియో కంటే ఎక్కువ డేటా ప్రయోజనాలను ఇస్తోంది. ఇదే  కాకుండా, వినియోగదారులు అపరిమిత కాలింగ్ సౌకర్యం పొందుతారు.

ముంబై అండ్ ఢిల్లీ లో 118 రూపాయలు రీఛార్జ్ లో  ఉచిత రోమింగ్ లేదు మరియు దీనికోసం వినియోగదారులు  ప్రత్యేక టారిఫ్ ప్లాన్ ని  రీఛార్జ్ చేయాలి . కంపెనీ  ఈ ప్లాన్ లో SMS బెనిఫిట్  లేదు, కానీ మీరు మరింత డేటా ఉపయోగిస్తే,  బిఎస్ఎన్ఎల్ ఈ ప్లాన్  మీకు  మరింత ఉపయోగకరంగా ఉంటుంది. 118 రూపాయల ఈ ప్లాన్  ప్రస్తుతం తమిళనాడు సర్కిల్ లోలభ్యం . 

 

 

 

 

 

 

 

Santhoshi
Digit.in
Logo
Digit.in
Logo