AI Voice Scam: ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త స్కామ్ | Tech News
ప్రపంచ వ్యాప్తంగా కొత్త AI Voice Scam కొత్తగా పురుడు పోసుకుంది
ఈ స్కామ్ దెబ్బకి అమాయక ప్రజల అకౌంట్స్ ఆవిరైపోతున్నాయి
ఈ కొత్త స్కామ్ తో మీరే స్వయంగా మీ అకౌంట్ నుండి డబ్బును పంపించేలా చేస్తారు
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ దెబ్బకి పనులు సులభం అవ్వడం ఏమోకానీ, కొత్త మోసాలు మాత్రం ఎక్కువయ్యాయి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కొత్త AI Voice Scam కొత్తగా పురుడు పోసుకుంది. అంతేకాదు, ఈ స్కామ్ దెబ్బకి అమాయక ప్రజల అకౌంట్స్ ఆవిరైపోతున్నాయి. వాస్తవానికి, సాధారణ OTP స్కామ్ లకు ఈ ఎఐ వాయిస్ స్కామ్ లకు చాలా వ్యత్యాసం వుంది. ఓటీపి స్కామ్ కోసం చాలా ప్రోసెస్ ఉండగా, ఈ కొత్త స్కామ్ కోసం ఒక కాల్ సరిపోతుంది. పైగా ఈ కొత్త స్కామ్ తో మీరే స్వయంగా మీ అకౌంట్ నుండి డబ్బును పంపించేలా చేస్తారు. మరి ఈ నయా స్కామ్ పైన ఒక లుక్కేయండి.
AI Voice Scam
ఇటీవలి కాలంలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ను వుపయోగించి మోసం చేయడం బాగా పెరిగిపోయింది. ఇతర దేశాల్లో బంధువులను కలిగివున్న వారిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. ముందుగా ఎంచుకున్న వారిని టార్గెట్ చేసిన తరువాత ఎఐ వాయిస్ ను ఉపయోగించి అచ్చంగా వారి బంధువులు లేదా తెలిసిన వారి వాయిస్ ను క్రియేట్ చేసి కాల్ చేస్తుంటారు.
కాల్ చేసి, మేము ఇక్కడ అనుకోకుండా ఇబ్బందుల్లో ఇరుక్కున్నాం లేదా ఎమర్జెన్సీ అవసరం ఉందని డబ్బులు చెప్పిన అకౌంట్ కు ట్రాన్స్ ఫర్ చెయ్యాలని కోరతారు. వాయిస్ కాల్ లో వినబడే వాయిస్ వారికి తెలిసిన వారిదే కాబట్టి, కోరిన అకౌంట్ కు డబ్బులు పంపిస్తున్నారు, ఆ కాల్ అందుకున్న వారు. అయితే, అసలు జరిగిన మోసం తెలిసిన తరువాత లబోదిబో అంటున్నారు.
ఇందుకు రీసెంట్ గా జరిగిన కొత్త మోసం ఒకటి సరైన ఉదాహరణ అవుతుంది. కెనడాలో నివసిస్తున్న మేనల్లుడు ఎమర్జెన్సీ కాల్ అందుకున్న ఒక పెద్దావిడ 1.4 లక్షల రూపాయలు ట్రాన్స్ ఫర్ చేసి మోసపోయింది. ఎందుకంటే, ఆమె అందుకుంది ఆమే మేనల్లుడి గొంతును పోలిన ఎఐ వాయిస్ కాల్. నిజం తెలిసే సమయానికి జరగాల్సిన నష్టం జరిగి పోయింది.
వాస్తవానికి, ఎఐ క్రియేటెడ్ వాయిస్ కాల్ ను గుర్తు పట్టడం చాలా కష్టం. అందుకే, తన మేనల్లుడు కష్టంలో ఉన్నాడనుకొని ఆ డబ్బును పంపించినట్లు సదరు మహిళ వాపోయింది.
Also Read : Free Netflix మరియు Unlimited 5G డేటా అందించే జియో బెస్ట్ ప్లాన్స్.!
ఎవరిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు?
సెంటర్ ఫర్ రీసర్చ్ ఆన్ సైబర్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్స్ (CRCIDF) డైరెక్టర్, ప్రసాద్ పాటిబండ్ల ఈ కొత్త స్కామ్ గురించి వివరించారు. గొంతును పోలిన గొంతుతో మిమిక్రి చేసే మాదిరిగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎదుటివారు మాటాడే మాటలను గొంతు మార్చి మాట్లాడుతుందని తెలిపారు.
ఇటివంటి మోసాలు ఎక్కువగా కెనడా మరియు ఇజ్రాయిల్ లో నివసిస్తున్న వారి ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కాబట్టి, ఆర్ధిక లావాదేవీల కోసం కాల్స్ వచ్చినప్పుడు పూర్తిగా నిజానిజాలు తెలుసుకోకుండా తొందరపడి చేతులు కాల్చుకోకండి.