Aadhaar New Scam: మెసేజ్ మరియు లింక్స్ తో స్కామర్లు కొత్త వల విసురుతున్నారు. ఆధార్ అప్డేట్ ను ఆశచూపించి ఈ కొత్త మోసాలకు తెరలేపుతున్నారు. ఆధార్ ను తీసుకొని 10 సంవత్సరాలు నిధిని ప్రతి ఒక్కరూ కూడా విధిగా వారి ఆధార్ ను అప్డేట్ చెయ్యాలని ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ప్రజలు వారి ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే, ఈ ఆధార్ అప్డేట్ ను మరింత ఈజీగా చేసేస్తామంటూ లేదా మీరే ఆన్లైన్ లో ఉచితంగా అప్డేద్త చేసుకోవచ్చని ఈ కొత్త వల విసురుతున్నారు స్కామర్లు.
ఆధార్ తీసుకొని 10 సంవత్సరాలు అవుతోందా? అయితే, మీ ఆధార్ ను వెంటనే అప్డేట్ చెయ్యండి. ఒకవేళ మీరు మీ ఆధార్ ను కొత్త వివరాలతో అప్డేట్ చెయ్యకుంటే మీ ఆధార్ సర్వీస్ లు నిలిపి వెయ్యబడతాయి అని స్కామర్లు కొత్త మెసేజీలను పంపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మెసేజ్ లో చివర ఆన్లైన్ లో ఉచితంగా లేదా సులభముగా ఆధార్ అప్డేట్ కోసం లింక్ పైన క్లిక్ చెయ్యండి, అని మోసపూరిత లింక్స్ పంపుతున్నట్లు తెలుస్తోంది. ఇటివంటి మెసేజీలు నమ్మారంటే ఇంక అంతే సంగతులు.
వాస్తవానికి, ఆధార్ 10 తీసుకొని సంవత్సరాలు నిండినా కూడా ఆధార్ అప్డేట్ ను స్వచ్చందంగా చెయ్యడానికి ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. అంతేకాదు, ఆధార్ అప్డేట్ ను ఉచితంగా చేసుకోవడానికి కూడా వీలు కల్పించింది. అంతేకాదు, సెప్టెంబర్ 14 వరకూ మాత్రమే విధించిన ఉచిత ఆధార్ అప్డేట్ గడువును మరో 3 నెలలు పెంచింది. ఇప్పుడుకొత్త గడువు ప్రకారం, డిసెంబర్ 14 వ తేదీ వరకూ 10 సంవత్సరాలు గడిచిన వారు, వారి ఆధార్ అప్డేట్ ను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు.
https://twitter.com/UIDAI/status/1699271970074804556?ref_src=twsrc%5Etfw
ఆధార్ సెంటర్ కి ఆధార్ అప్డేట్ చేసుకోవడం అనేది ఉత్తమైన మార్గంగా ఉంటుంది. అయితే, అడ్రెస్స్ ను ఆన్లైన్ లో మీరే స్వయంగా మార్చుకోవచ్చు. దీనికోసం, మీరు UIDAI అధికారిక వెబ్సైట్ ఎంచుకోవడం ప్రధాన మార్గం. uidai.gov.in అనేది అఫీషియల్ ఆధార్ సర్వీస్ వెబ్సైట్ మరియు ఇందులో మీకు నచ్చిన భాషను ఎంచుకొని చాలా సులభంగా వివరాలను చూడవచ్చు మరియు కొన్ని వివరాలను అప్డేట్ కూడా చేసుకుం వీలుంది.
అయితే, ఆధార్ అప్డేట్ గురించి మీకు ఎటువంటి సందేహం వున్నా కూడా మీ దగ్గరలోని ఆధార్ సెంటర్ ను సందర్శించడం ఉత్తమమైన మార్గం అవుతుంది.