Big Alert: New ట్రిక్ తో బ్యాంక్ అకౌంట్స్ కొల్లగొడుతున్న స్కామర్లు.!

Updated on 30-Oct-2023
HIGHLIGHTS

దేశంలో కొత్త స్కామ్ విచ్చల విడిగా కొనసాగుతోంది

డెలివరీ బాయ్స్ కాల్స్ ముసుగులో కొత్త మోసాలకు స్కామర్లు తెరలేపారు

కొత్త స్కామ్ ఏమిటి దీని నుండి ఎలా తప్పించుకోవాలో వివరంగా తెలుసుకోండి

Big Alert: దేశంలో New Scam విచ్చల విడిగా కొనసాగుతోంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్ కొనుగోళ్ళను ఎక్కువగా చేస్తున్నారు. ఈ వస్తువులు లేదా మరేదైనా ఇతర ఆన్లైన్ కొనుగోలు డెలివరీల కోసం అందుకునే డెలివరీ బాయ్స్ కాల్స్ ముసుగులో కొత్త మోసాలకు స్కామర్లు తెరలేపారు. వాస్తవానికి, అసలు కంపెనీ లేదా డెలివరీ బోయ్స్ కి ఎటువంటి సంభందం లేకుండానే ఈ కథంతా నడుపుతున్నారు. ఈ కొత్త స్కామ్ ఏమిటి దీని నుండి ఎలా తప్పించుకోవాలో వివరంగా తెలుసుకోండి.

గతంలో మాదిరిగానే స్కామర్లు ఎప్పటికప్పుడు ఎక్కువగా ప్రజలు ఆధారపడే విషయాన్నే తమ స్కామ్ కు అడ్డాగా ఎంచుకున్నారు. ఆన్లైన్ కొనుగోళ్లు లేదా ఇతర వస్తువులను ఇంటి వద్దకే తెప్పించుకోవడం ఇప్పుడు ప్రజలు ఎక్కువగా ఎంచుకుంటున్న మార్గం మరియు ఇది చాలా సులభమైనది మరియు సురక్షితమైనది కూడాను.

Big Alert: New Scam

అయితే, ఆన్లైన్లో మోసాలకు తెగబడే స్కామర్లు ఇప్పుడు ఇదే విషయాన్ని టార్గెట్ చేసి కొత్త స్కామ్ కు తెరలేపారు. మీరు చేసిన సామానులు అందిచడానికి డెలివరీ బాయ్ కి అడ్రస్ సరిగా అర్ధం కావడం లేదని, మీ అడ్రెస్స్ ను సరిగ్గా తెలియ చెయ్యడానికి మేము తెలిపిన కోడ్ తో మొబైల్ నెంబర్ డయల్ చేస్తే సరిపోతుందని చెబుతారు. దీనికోసం ముందుగా 401 కోడ్ ను ఎంటర్ చేసి తెలిపిన మొబైల్ నెంబర్ కు డయల్ చెయ్యాలనేది స్కామర్లు చెప్పే మాట.

Also Read : Gold Price Update: ఈరోజు గోల్డ్ రేట్ మరియు మార్కెట్ అప్డేట్ తెలుసుకోండి.!

అలా చేస్తే ఏమవుతుంది?

అలా చేస్తే ఏమవుతుంది అనుకుంటున్నారా? స్కామర్లు చెప్పినట్లుగా 401 కోడ్ తో వారు చెప్పిన నెంబర్ ను ఎంటర్ చేసి కాల్ చేశారంటే, వెంటనే మీకు నెంబర్ కు రావాల్సిన కాల్స్ మరియు OTP లు వారు ఎంటర్ చేయించిన నెంబర్ కు వెళతాయి. అంటే, మీ బ్యాంక్, UPI ప్రెమెంట్స్ మరియు ఇలాంటి అన్ని వివరాలు కూడా ఆ నెంబర్ కు వెళతాయి.

OTP

ఇంకేముంది, మీ OTP మరియు ఇంపార్టెంట్ కాల్స్ తో మీ అకౌంట్ ఖాలీ అవ్వడమే కాకుండా మరిన్ని చిక్కులు కూడా తెచ్చి పెడతాయి.

మరి ఏమి చెయ్యాలి?

మరి ఇటువంటి మోసాల నుండి సింపుల్ గా తప్పించుకోవచ్చు. డెలివరీ లేదా మరింకేదైనా విషయాల కోసం ఎటువంటి కంపెనీ లేదా డెలివరీ బాయ్స్ కూడా కోడ్ తో కూడా నెంబర్ ను ఎంటర్ చెయ్యాలని మిమ్మల్ని ఎట్టి పరిస్థితుల్లోనే అడగరు. కాబట్టి, ఇటువంటి కాల్స్ వచ్చినట్లయితే, వాళ్లు స్కామర్లుగా మీరు గుర్తించువచ్చు మరియు అటువంటి వారిని నమ్మవద్దు. ఇటువంటి కాల్స్ ను పక్కన పెట్టేయడమే మీకు ఉత్తమం.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :