భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.!

భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్.!
HIGHLIGHTS

Flipkart నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్

రూ.11,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో అతి తక్కువ ధరకే లభిస్తోంది

గూగుల్ పిక్సెల్ 6a పైన 11 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు

Flipkart నుండి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్. గూగుల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 6a ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ నుండి రూ.11,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో అతి తక్కువ ధరకే లభిస్తోంది. భారీ కెమెరా సెటప్ మరియు ప్రత్యేకతలతో పాటుగా ఆకర్షణీయమైన డిజైన్ జతగా పవర్ ఫుల్ ప్రాసెసర్ తో వచ్చిన ఈ ఫోన్ ను మిడ్ రేంజ్ ధరలోనే పొందే వీలుంది. గూగుల్ పిక్సెల్ 6a స్మార్ట్ ఫోన్  పైన అందిస్తున్న ఆఫర్లను గురించి తెలుసుకోండి.    

Google Pixel 6a: ధర మరియు ఆఫర్లు

గూగుల్ పిక్సెల్ 6a ఇండియాలో ముందుగా రూ.43,999 ధరతో ఫ్లిప్‌కార్ట్ నుండి లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ ను ప్రస్తుతం 9,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.34,999 అఫర్ ధరకే సేల్ చేస్తోంది. అదనంగా, అన్ని ప్రధాన బ్యాంక్స్ యొక్క క్రెడిట్/డెబిట్ కార్డ్ ల పైన 2,000 అదనపు డిస్కౌంట్ ను కూడా అఫర్ చేస్తోంది. అంటే, మీ బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి ఈ ఫోన్ ను కోగోలు చేస్తే 2,000 రూపాయల డిస్కౌంట్ పొందవచ్చు. అంటే, గూగుల్ పిక్సెల్ 6a పైన 11 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోవచ్చు.         

Google Pixel 6a: స్పెక్స్

గూగుల్ పిక్సెల్ 6ఎ స్మార్ట్ ఫోన్ 6.14-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది OLED ప్యానెల్‌. ఈ డిస్ప్లే ఎగువ మధ్యలో పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. పిక్సెల్ 6 ఎ స్మార్ట్ ఫోన్ Google టెన్సర్ యొక్క శక్తితో నడుస్తుంది. ఇఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది.

గూగుల్ పిక్సెల్ 4 ఎ, డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 12.2 MP డ్యూయల్ పిక్సెల్ వైడ్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరాలతో వస్తుంది. ఈ కెమెరాలు OIS మరియు EIS లకు కూడా సపోర్ట్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 6 ఎ యొక్క కెమెరా Live HDR+, సినీమ్యాటిక్ పాన్, డ్యూయల్ ఎక్స్ పోజర్ కంట్రోల్స్, వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ వెనుక కెమెరాతో 30Kps/60Kps వద్ద 4K, 30/60fps వద్ద 1080p మరియు 240fps వరకు 720p రికార్డ్ చేయగలదు. ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి వుంది.

Pixel 6 a ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,410 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి వుంది. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IP67 వాటర్ ప్రొటక్షన్ తో వస్తుంది. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo