ఆండ్రాయిడ్ ఫోన్లలో స్టూడియో క్వాలిటీ సౌండ్ ఇవ్వనున్న Netflix
ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో కూడా స్టూడియో క్వాలిటీ సౌండ్
నెట్ ఫ్లిక్స్ మంచి సౌండ్ టెక్నాలజీతో కంటెంట్ చూడవచ్చు.
యాక్షన్ సేన్ లో కూడా డైలాగులు స్ఫష్టంగా వినిపిస్తాయి.
ప్రధాన ఆన్లైన్ స్ట్రీమింగ్ సర్వీస్ ప్రొవైడర్ Netflix ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు లేదా పరికరాల్లో ఆడియో క్వాలిటీని మెరుగుపరచాలని ఆలోచిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి, టీవీలలో Dolby Atmos, Dolby Vision, Dts-X వర్చువల్ తో పాటుగా అన్నిరకాలైన ఆడియో మరియు వీడియో ఫార్మాట్ లకు మద్దతునిస్తున్న స్ట్రీమింగ్ సర్వీస్ గా నెట్ ఫ్లిక్స్ ఇప్పటికే ముందు స్థానంలో నిలుస్తుంది. అయితే, ఇప్పుడు ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లలో కూడా స్టూడియో క్వాలిటీ సౌండ్ ఇవ్వడానికి చూస్తోంది.
దీని గురించి తెలిపిన ప్రకటనలో, అనుకూలమైన ఆండ్రాయిడ్ పరికరాలలో ఇప్పుడు Netflix తన స్ట్రీమింగ్ సేవలను HE-AAC ను MPEG-D DRC (XHE-AAC) తో ప్రసారం చేస్తుందని తెలిపింది.
ఈ కొత్త XHE-AAC యొక్క మంచి విషయం ఏమిటంటే, ఇది స్కేలబుల్. అర్ధమయ్యేలా చెప్పాలంటే, మీ కనెక్షన్ మంచి స్పీడుతో ఉన్నప్పుడు మీకు మంచి స్టూడియో క్వాలిటీ ఆడియోను అందిస్తుంది మరియు మీ ఆడియో కనెక్షన్ బలహీనంగా వున్నప్పుడు తిరిగి స్కేల్ చేస్తుంది. ఇందులో వున్న మరొక ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో లౌడ్ నెస్ మేనేజ్ మెంట్ కూడా వుంది. దీని ద్వారా, యాక్షన్ సన్నివేశాల్లో కూడా డైలాగులు చాలా చక్కగా వినిపిస్తాయి.
ఇక ఈ XHE-AAC ప్రయోజనాన్ని మాత్రం ఆండ్రాయిడ్ 9 లేదా అంతకన్నా ఎక్కువ వెర్షన్ స్మార్ట్ ఫోన్లను వాడుతున్న వినియోగదారులకు మాత్రమే అందిస్తుంది. `