CES 2016 సందర్భంగా Netflix CEO, Reed ఇండియాలో NetFlix వస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇది వీడియో ప్రసారాలను, సినిమాలను అందించే టీవీ డిష్ సర్వీస్ వంటిది.
అమెరికా వంటి దేశాలలో బాగా ఫేమస్. 500 నుండి మొదలవుతున్నాయి సబ్స్టేషనులు. 650 రూ నుండి HD ప్లాన్స్ మొదలవుతున్నాయి.
800 రూ లకు అల్ట్రా HD ప్లాన్ ఉంది. బేసిక్ ప్లాన్ లో ఒక స్క్రీన్ పై కంటెంట్ stream అవుతుంది.స్టాండర్డ్ ప్లాన్ లో రెండు, ప్రీమియం లో 4 టీవీ/స్క్రీన్ ల వరకు కంటెంట్ ను ఆనందించవచ్చు.
అన్నీ ప్లాన్స్ లాప్ టాప్, టీవీ, మొబైల్, టాబ్లెట్స్ మరియు స్ట్రీమింగ్ dongles కూడా ప్లగ్ in చేసుకోగలరు. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే నెట్ ఫ్లిక్స్ మొదటి నెల ఫ్రీ గా వస్తుంది.
పైన ఇండియన్ సబ్స్టేషన్ ప్లాన్స్ చూడగలరు. ఇది సినిమాలను చూపించటమే కాకుండా సొంతంగా వరల్డ్ వైడ్ ఇంగ్లిష్ సీరియల్స్ కూడా ప్రదర్శిస్తుంది.
House of cards, narcos,Marvel's Daredevil and Jessica Jones and Orange Is the New Black వంటి ఫేమస్ షోస్ వీల్లవే.
ఇండియాలో ఆల్రెడీ ఉన్న DTH ల ధరల కన్నా ఇది బెటర్ గా ఉంది. అయితే మరి ఇండియాలో నెట్ ఫ్లిక్స్ ఏమి చూపిస్తుంది మనకు? ఇండియన్ రీజనల్ కంటెంట్ ను అందించటానికి ప్రొడక్షన్ హౌసెస్ తో టీమ్ అప్ అవుతుంది. అంటే మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా మీకు కావలసిన కంటెంట్ ఇస్తుంది.
Provider | Pack Name | Cost (Rs.) |
Videocon | Platinum HD | 608 |
DishTV | New Titanium | 499 |
TataSKY | Ultra HD | 730 |
Airtel | Magnum | 675 |
SunDirect | HD+ Mega | 500 |
ఇటువంటిదే ఇండియాలో Hungama Play అని ఉంది. 15 వేల మ్యూజిక్ వీడియోస్, 7,500 సినిమాలు ఉన్నాయి దిని లైబ్రరీ లో.
ఫైనల్ పాయుంట్ : నెట్ ఫ్లిక్స్ ఆల్రెడీ ఉన్న డిష్ టీవీ లు ఇస్తున్న కంటెంట్ (టీవీ చానెల్స్) ను ఇవ్వకపోతే ఇది కేవలం ఫ్యాన్సీ ఓపెనింగ్ గానే మిగిలిపోతుంది. అయితే టీవీ చానెల్స్ నిబంధనలు ప్రకారం నెట్ ఫ్లిక్స్ లో స్పోర్ట్స్ మాత్రం రావు. బహుసా నెక్స్ట్ ఇయర్ నిబంధనలు మార్చితే వస్తాయి.