Netflix: యాడ్స్ తో సరసమైన ప్లాన్లను ప్రకటించిన నెట్ ఫ్లిక్స్..!
యూజర్ బేస్ ను నిలిపేందుకు నెట్ ఫ్లిక్స్ ఇటీవల కొత్త ప్లాన్లను ప్రకటించింది
యాడ్స్ తో వచ్చే కొత్త సరసమైన ప్లాన్ లను Netflix అందించింది
చవక ధరలో యాడ్ లతో తెచ్చిన సరసమైన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది
Netflix: ప్రపంచవ్యాప్తంగా తగ్గుతున్న యూజర్ బేస్ ను నిలిపేందుకు నెట్ ఫ్లిక్స్ ఇటీవల కొత్త ప్లాన్లను ప్రకటించింది. యాడ్స్ తో వచ్చే కొత్త సరసమైన ప్లాన్ లను అందించింది. అయితే, ఈ ప్లాన్ రేట్లను తగ్గించింది మన దేశంలో కాదనుకోండి. UK లో ఈ కొత్త ప్లాన్ లను అందించింది. ఈ ప్లాన్ సక్సెస్ అవ్వడంతో, UK మరియు US తో పాటు కెనడా లో బేసిక్ ప్లాన్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ ప్లాన్ స్థానంలో రెండు కొత్త ప్లాన్లను ఎంచుకునేలా ఆప్షన్ లను ఆఫర్ చేస్తోంది. ఈ బేసిక్ ప్లాన్ స్థానంలో యాడ్ సపోర్ట్ ప్లాన్ మరియు యాడ్ ఫ్రీ ప్లాన్ రెండు ఆప్షన్లు యూజర్లకు లిస్ట్ చేసింది.
Netflix New Plans
ఇటీవల బేసిక్ ప్లాన్ ను నిలిపివేస్తున్నట్లు నెట్ ఫ్లిక్స్ UK మరియు US దేశాలలో ప్రకటించింది. అదే సమయంలో యాడ్స్ తో కూడిన కొత్త ప్లాన్ ను కూడా పరిచయం చేసింది. యూజర్ బేస్ ను పెంచడానికి మరియు అదే సమయంలో కంపెనీ నష్టాల దారి పట్టకుండా ఉండేందుకు ఈ కొత్త చర్య తీసుకుంది. నెట్ ఫ్లిక్స్ ఊహించినట్లుగానే అక్కడ చవక ధరలో యాడ్ లతో తెచ్చిన సరసమైన ప్లాన్ వర్క్ అవుట్ అయ్యింది. ఈ ప్లాన్ దెబ్బకి యూజర్ బేస్ అమాంతం పెరిగినట్లు కూడా రిపోర్ట్స్ చెబుతున్నాయి.
అందుకే, నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేస్తున్న బేసిక్ ప్లాన్ నిలిపివేసి యాడ్స్ తో కూడిన సరసమైన ప్లాన్ లేదా స్టాండర్డ్ ప్లాన్ ను ఎంచుకోవాలని నెట్ ఫ్లిక్స్ నోటిఫికేషన్ లను అందిస్తోంది. ఈ నోటిఫికేషన్ లతో కూడిన స్క్రీన్ షాట్ లను ఒక యూజర్ reddit లో పోస్ట్ చేశారు. దీని ప్రకారం, ఇప్పటి వరకూ $9.99 లకు ఆఫర్ చేస్తున్న బేసిక్ ప్లాన్ ను నిలిపేసింది. దీనికి బదులుగా యాడ్స్ తో కూడిన $5.99 లేదా FHD స్టాండర్డ్ ప్లాన్ $16.49 లేదా 4K ప్రీమియం ప్లాన్ $20.99 లను ఎంచుకోవాలని సూచిస్తోంది.
Also Read: గ్రేట్ డీల్స్ తో Amazon Prime Day సేల్ అనౌన్స్ చేసింది.!
ఇప్పటికే మన దేశంలో చాలా OTT ప్లాట్ ఫామ్స్ తమ యూజర్ బేస్ తరలి వెళ్లకుండా నిలుపుకునేందుకు యాడ్స్ తో కూడిన ప్లాన్ లను అందిస్తున్నాయి. నెట్ ఫ్లిక్స్ కు ఇండియాలో గడ్డుకాలం ఎదురవుతున్న నేపథ్యంలో బయట దేశాల్లో అందిస్తున్న ఈ సరసమైన యాడ్ ప్లాన్ లను ఇండియాలో కూడా ప్రారంభించవచ్చని అంచనా వేస్తున్నారు. ఇదే కనుక నిజం అయితే ఇండియాలో కూడా యాడ్స్ తో కూడిన సరసమైన నెట్ ఫ్లిక్స్ ప్లాన్ వచ్చే అవకాశం ఉంటుంది.
అయితే, ఈ విషయం పైన నెట్ ఫ్లిక్స్ నుండి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించే వరకూ ఎటువంటి నిర్ధారణకు రాలేము.