Droni: మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ ను లాంచ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని.!

Droni: మేడ్ ఇన్ ఇండియా డ్రోన్ ను లాంచ్ చేసిన మహేంద్ర సింగ్ ధోని.!
HIGHLIGHTS

మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరిస్తున్న కంపెనీలలో Garuda Aerospace కూడా ఒకటి

Droni కెమెరా డ్రోన్ బ్యాటరీతో పనిచేస్తుంది

Droni రైతులకు ఉపయోగపడుతుంది

మహేంద్ర సింగ్ ధోని బ్రాండ్ అంబాసిడర్ గా వ్యహరిస్తున్న కంపెనీలలో Garuda Aerospace కూడా ఒకటి. అంతేకాదు, గరుడా ఏరోస్పేస్ లో ధోని ఇన్వెస్టర్ గా కూడా కొనసాగుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయంలో వ్యవసాయంలో డ్రోన్ ల ఉపయోగం మరియు డ్రోన్ ల ద్వారా రైతులకు ఎటువంటి ప్రయోజనం చేకూరుతుందో అర్ధం చేసుకున్న ధోని, తన ఆలోచనలను కంపెనీతో పంచుకున్నారు. ఆ ఆలోచన నుండి పుట్టుకొచ్చిందే ఈ Droni కెమెరా డ్రోన్.

ఈ కెమెరా డ్రోన్ బ్యాటరీతో పనిచేస్తుంది మరియు సర్వీలియన్స్, తనిఖీలు, క్రాప్ సర్వ్, పంటలు పండించడం మరియు సోలార్ ప్యానల్స్ శుభ్రం చేయడం వంటి మరిన్ని అప్లికేషన్లు ఉంటాయి. ఈ డ్రోన్ ఎటువంటి స్పెక్స్ మరియు ఫీచర్లను కలిగివున్నది గరుడా ఏరోస్పేస్ తెలియచేయలేదు. కానీ, ఈ ఏడాది చివర్లో ఈ ప్రోడక్ట్ ను మార్కెట్లోకి తీసుకువచ్చే లోపు కంపెనీ దీని ఫీచర్లను ముందుగా ఆవిష్కరించవచ్చు. ఈ సంవత్సరం చివరినాటికి ఈ డ్రోన్ కొనుగోలుకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

గరుడ ఏరోస్పేస్ యొక్క బ్రాండ్-న్యూ కిసాన్ డ్రోన్‌ తో పాటుగా చెన్నైలో జరిగిన గ్లోబల్ డ్రోన్ ఎక్స్‌పోలో Droni ని కూడా ప్రదర్శించారు. ఇది ఒకే రోజులో మూడు ఎకరాలకు పైగా పురుగు మందులను పిచికారీ చూసేలా రూపొందించబడింది. 'మా డ్రోన్ ఒక స్వదేశీ డ్రోన్, అది చేయగల నిఘా అప్లికేషన్‌లలో అనువైనది. ఇది నమ్మశక్యం కాని శక్తివంతంగా ఉండటంతో పాటు, అత్యాధునిక నిర్మాణ సాంకేతికతలను కలిగి ఉంది' అని, ఈ డ్రోన్ గురించి గరుడ ఏరోస్పేస్ ప్రెసిడెంట్ మరియు CEO అయిన అగ్నిశ్వర్ జయప్రకాష్ తెలిపారు. 

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo