ఈ షియోమి ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 13 అప్డేట్ తీసుకువస్తోంది.!

ఈ షియోమి ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 13 అప్డేట్ తీసుకువస్తోంది.!
HIGHLIGHTS

షియోమి స్మార్ట్ ఫోన్ల కోసం Android 13 ఆధారిత MIUI 14 అప్డేట్

MIUI 14 సాఫ్ట్ వేర్ ఆధారిత Android 13 అప్డేట్ ఇప్పటికే చైనాలో అంధుబాటులో వుంది

ఈ కొత్త అప్డేట్ ముందుగా అందుకోనున్న షియోమి ఫోన్లు

షియోమి యొక్క కొన్ని స్మార్ట్ ఫోన్ల కోసం Android 13 ఆధారిత MIUI 14 అప్డేట్ ను భారతీయ యూజర్ల కోసం సిధ్దం చేసినట్లు చెబుతున్నాయి. వాస్తవానికి, MIUI 14 సాఫ్ట్ వేర్ ఆధారిత Android 13 అప్డేట్ ఇప్పటికే చైనాలో అంధుబాటులో వుంది మరియు ఇప్పుడు మన దేశంలో కూడా యూజర్లకు చేరువయ్యింది. ఈ కొత్త అప్డేట్ ముందుగా అందుకోనున్న షియోమి ఫోన్లు మరియు వాటి  వివరాలను తెలుసుకోండి. 

 ఇండియాలో షియోమి ముందుగా రెండు ప్రీమియం ఫోన్ల కోసం ఈ అప్డేట్ ను తీసుకువస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. MIUI 14 అప్డేట్ ముందుగా అందుకోనున్న వాటిలో Xiaomi 12 Pro మరియు Poco F4 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. అంటే, ఈ రెండు స్మార్ట్ ఫోన్లు వాడుతున్న భారతీయ వినియోగదారులకు MIUI 14 సాఫ్ట్ వేర్ ఆధారిత Android 13 అప్డేట్ ముందుగా అందుబాటులోకి వస్తుంది. ఈ అప్డేట్ ఈ ఫోన్లలో విజయవంతంగా టెస్ట్ చేసినట్లు మరియు త్వరలోనే విడుదల చేయనున్నట్లు కూడా తెలుస్తోంది. 

ప్రస్తుతం ఆన్లైన్ లో వస్తున్న నివేదికలు కనుక నిజమైతే, అతిత్వరలోనే ఈ రెండు ఫోన్లు వాడుతున్న యూజర్లలకు MIUI 14 అప్డేట్ గురించి అధికారిక ప్రకటన అందవచ్చు. 

Xiaomi 12 Pro: స్పెక్స్

షియోమి 12 ప్రో 10-bit 6.73-అంగుళాల 2K+ (3200×1440 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది Dolby Vision మరియు HDR10+ సపోర్ట్ తో పాటుగా 120Hz రిఫ్రెష్ రేట్‌ మరియు 480Hz టచ్ శాంప్లింగ్ రేట్ తో వస్తుంది. ఈ ప్రీమియం డిస్ప్లే మరింత పటిష్టంగా ఉంచేలా గొరిల్లా గ్లాస్ విక్టస్ రక్షణతో ఈ డిస్ప్లే ని అందించింది.

ఈ ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ ప్రొసెసర్ Snapdragon 8 Gen1 SoC తో వస్తుంది. అలాగే, ఈ ఫోన్ LPDDR5 12GB RAM మరియు UFS 3.1 256GB వరకు స్టోరేజ్ ఎంపికతో జత చేయబడింది మరియు MIUI 13 సాఫ్ట్ వేర్ తో ఆండ్రాయిడ్ 12 OS పైన నడుస్తుంది. ఈ ఫోన్ లో OIS తో 50MP (IMX707) కెమెరా జతగా 50MP అల్ట్రా-వైడ్ కెమెరా మరియు 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫోటో కెమెరాలు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా ఉంది. ఈ కెమెరాతో 24fps వద్ద 8K వీడియోలను, 60fps వద్ద 8K వీడియోలను చిత్రీకరించవచ్చు. అలాగే, సెల్ఫీల కోసం  ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉంది. ఈ కెమెరాతో HDR 10+ వీడియోలను చిత్రీకరించవచ్చు  

Xiaomi 12 Pro స్టీరియో స్పీకర్‌ లను కూడా కలిగి ఉంది మరియు 4,600mAh బ్యాటరీని భారీ 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ మరియు 50W ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో ఈ ఫోన్ లో అందించింది. అంతేకాదు, 10W రివర్స్ వైర్ లెస్ ఛార్జింగ్ కు కూడా సపోర్ట్ చేస్తుంది.  ఈ ఫోన్ కౌటర్ బ్లూ, నోయిర్ బ్లాక్ మరియు ఒపేరా మౌవే అనే మూడు విలక్షణమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo