AI మరియు హెల్త్ కేర్ అప్స్ ప్రధాన అంశంగా జరుగుతున్న మైక్రో సాఫ్ట్ ఇమాజిన్ కప్ 2018 కి భారతదేశానికి చెందిన మూడు టీంలు ఎంపిక అయ్యాయి
గెలిచిన టీం కి బహుమతిగా $ 100,000 (Rs 68.7 లక్షలు ఇంచుమించు ) లేదా ఒక్కొక్కటి $15,000 (Rs 10.37 లక్షలు ఇంచుమించు) విలువైన మూడు ప్రత్యేక బహుమతులు అందించనుంది. అంతేకాకుండా మెంటోర్షిప్ సెషన్ సమయం లో మైక్రో సాఫ్ట్ సీఈఓ అయినటువంటి, సత్య నాదెళ్ల గారితో సంభాషించే అవకాశం దొరుకుతుంది
సీటెల్ లో జరగబోయే ఇమాజిన్ కప్ ఫైనల్ కోసం, ఇండియా లో జరిగిన మైక్రో సాఫ్ట్ ఇమాజిన్ కప్ 2018 నుండి మూడు టీం లను మైక్రో సాఫ్ట్ ఎంపిక చేసింది . ఆ మూడు టీమ్స్ ఏవంటే : టీం రియల్ వాల్ నుంచి ఐఐటీ ఢిల్లీ ,టీం డ్రగ్ సేఫ్ నుంచి ఆర్ వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , బెంగుళూరు మరియు టీం ప్రాక్టీకాలిటీ నుంచి అమిటీ ఇంటర్నేషనల్ స్కూల్ ,ఢిల్లీ ఎంపిక అయ్యాయి . ఈ మూడు టీం లు కూడా జూలై 23 నుండి 25 తారీఖున రెడ్ మాండ్ ,వాషింగ్టన్ లో ఉన్న కంపెనీ యొక్క హెడ్ ఆఫీస్ లో జరగబోయే ఇమాజిన్ కప్ ఫైనల్స్ లో వారి ఆలోచనలను ప్రదర్శించే అవకాశం దొరుకుతుంది. వారి యొక్క ఆలోచనల ద్వారా గెలిచిన వారు మెంటోర్షిప్ సెషన్ సమయం లో మైక్రో సాఫ్ట్ సీఈఓ అయినటువంటి, సత్య నాదెళ్ల గారితో సంభాషించే అవకాశం తో పాటుగా బహుమతిగా $ 100,000 (Rs 68.7 లక్షలు ఇంచుమించు ) లేదా ఒక్కొక్కటి $15,000 (Rs 10.37 లక్షలు ఇంచుమించు) విలువైన మూడు ప్రత్యేక బహుమతులు పొందవచ్చు.
మైక్రో సాఫ్ట్ తన ఇమాజిన్ కప్ ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తోంది ,అలాగే 10,000 మంది భారతీయ విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారని తెలిపింది. పోటీలో అందరిని వెనుక్కినెట్టి నెగ్గిన ఈ మూడు టీంలు ఏమేమి తయారు చేసారో పూర్తిగా పరిశీలిద్దాం . CT స్కాన్ లేదా MRI స్కాన్ ని 3డి మోడల్ గా మార్చే ఒక పరిస్కారాన్ని కనిపెట్టారు ఢిల్లీ నుంచి రియల్ వాల్ టీం . ఈ మోడల్ ద్వారా రోగి యొక్క స్కాన్ ని డాక్టర్స్ వర్చువల్ రియాలిటీ (VR) లో చూడవచ్చు తద్వారా రోగి యొక్క ఇబ్బందిని తొరగా గుర్తించడానికి త్వరతగతిన వైద్యం చేయడానికి ని సహాయ పడుతుంది . ఈ అప్ ని రూపొందించిన పలాష్ రాజన్ బన్సల్ తన మాటల్లో " వర్చువల్ రియాలిటీ (VR) అనేదానిని తయారుచేయాలని తాను టీనేజ్ లో ఉన్నప్పుడే కలలుకనేవాడినని ఎప్పడూలేని విధంగా గేమ్స్ మరియు VR అనుభూతిని అందించామని " చెప్పారు . అవార్డు గెలుచుకున్న ఈ ఆప్ మెడికల్ ఇమేజెస్ నుండి 3D VR విజువలైజేషన్ ని ఉత్పత్తి చేస్తుంది తద్వారా 2D ఇమేజెస్ ను నిజ సమయంలో 3D ఆబ్జెక్ట్స్ గా మారుస్తుంది .
డ్రగ్ సేఫ్ అనేది ఆర్.వీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ , బెంగళూరు కి చెందిన ముగ్గురు విద్యార్థుల రూపకల్పన . AI ని ఉపయోగించుకొని ఫేక్ డ్రగ్స్ ని గుర్తిస్తుంది ఇంకా ఇది డ్రగ్ సేఫ్ అప్ లో ఉన్న మల్టీ – లేయర్ ద్వారా తనిఖీ చేస్తుంది మరియు వినియోగదారుడు తన మెడిసిన్ యొక్క చెల్లుబాటు వ్యవధిని కూడా తెలిసికోవచ్చు . ఈ ఆప్ ఆప్టికల్ క్యారెక్టర్ రికక్గ్నైజేషన్ (OCR) ని వాడుకొని మెడిసిన్ యొక్క డిజైన్ మరియు ప్యాకేజింగ్ మినిట్ వివరాలు తెలియపరుస్తుంది. దాని తరువాత తయారీదారు మరియు ట్రేడ్ మార్క్ వివరాలతో స్కాన్ చేసి సరిపోలుస్తుంది.టీం మెంబర్స్ అయినటువంటి ప్రతీక్ మోహాపాత్ర మరియు శ్రీహరి హెచ్ ఎస్ మాట్లాడుతూ "వరల్డ్ హెల్త్ ఆర్గనైజషన్ ప్రకారం ఇండియాలో అమ్ముడయ్యే దాదాపుగా 40శాతం మెడిసిన్లు నకిలీవని అంచనా . అంటే దాదాపుగా అమ్మేవాటిలో సగం మెడిసిన్ లు నకిలీవి అవ్వడం మనల్ని దిగ్భ్రాంతిచేసే విషయం" అని తెలిపారు .
టీం ప్రాక్టీకాలిటీ ఇమాజిన్ కప్ 2018 ఫైనల్ కి మూడవదిగ ఎంపికైంది. ఈ గ్రూప్ అంగవైకల్యం కలవారికి ఉపయోగపడేలా AI-అసిస్టెడ్ కమ్యూనికేషన్ ఆప్ తో ముందుకొచ్చారు. ఈ ఆప్ వాయిస్ (టెక్స్ట్ నుండి స్పీచ్ ),ఈఆసి (స్పీచ్ నుండి టెక్స్ట్ లేదా సంజ్ఞల భాషా ) మరియు విజన్ (పేస్ డిటక్షన్ ) ఫిచర్ లను పెంపొందించారు .ఇది ముగ్గురు హై స్కూల్ స్టూడెంట్స్ అయినటువంటి, పదం చోప్రా ,ఆర్యమన్ అగర్వాల్ మరియు కేశవ్ మహేశ్వరీ ఆలోచనల ద్వారా రూపొందింది . "చివరిగా , మా సొల్యూషన్ ను మార్కెట్ లో ప్రవేశపెట్టి వీలైనంత ఎక్కువ మందికి అందేలా చూస్తామని " , అగర్వాల్ తెలిపారు. "అనుకున్నది సాదించడినికి మొదటి మెట్టుగా ఇమాజిన్ కప్ ఉపాయాగపడుతుంది . కొత్త విషయాలు నేర్చుకోవడానికి మొత్తం ప్రోసెస్ కూడా ఒక గొప్ప అనుభూతినిచ్చిందని ఎవరైతే తమ పరిజ్ఞాన్ని ,ఆలోచనలను దేశవ్యాప్తంగా తెలియచేయాలని అనుకుంటున్నారో వారికీ ఇది చక్కగా ఉపయోగపడుతుందని ", మహేశ్వరీ వివరించారు . చోప్రా యొక్క తాత గారు మూగతనం తో భాదపడం తమ ఆప్ కి ప్రేరణ ఇచ్చిందని తెలిపారు .
"దేశ నలుమూల నుండి వచ్చిన వినూత్నమైన మరియు కస్టపడి సాధించే విద్యార్థుల్ని అందర్నీ ఒక దగ్గర చూస్తుంటే చాల అద్భుతంగా ఉంది" అని మైక్రో సాఫ్ట్ ఇండియా ప్రసిడెంట్ అయినటువంటి అనంత్ మహేశ్వరీ గారు వ్యక్తపరిచారు . "ఈ రోజు మనం ఎదుర్కొనే సమస్యలను కటింగ్ – ఎడ్జ్ టెక్నాలజీ తో ప్రరిస్కారం చేసే ప్రయత్నం చేసారు. అంతకంటే ముఖ్యంగా ఇంకా ఎన్నో కొత్త పరిజ్ఞానం మనం చూడవచ్చనే నమ్మకాన్ని కలిగించారు.ఈ యువ ఆలోచనలు అన్ని అడంకులను అధిగమిస్తామని ఈ ప్రాసెస్ కి మైక్రో సాఫ్ట్ చేయుట అందించడం చాల సంతోషంగా ఉందని కూడా తెలిపారు .
ఈ మూడు టీం లు కూడా తమ ఆలోచనలను సీటెల్ లో జ్యూరీ ముందు ఉంచబోతున్నారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ బిజినెస్ అయిన పెగ్గీ జాన్సన్ ;అనిల్ డాష్ ,సిఇఓ అఫ్ గ్లిచ్ ;మరియు సిఓఓ మరియు కో – ఫౌండర్ అఫ్ బిత్నామీ అయిన ఎరికా బ్రేస్సియా జ్యూరీ గా ఉన్నారు .