మైక్రోసాఫ్ట్ విండోస్ 10 గాడ్జెట్స్ లాంచ్ ఈవెంట్: సర్ఫేస్ ప్రో 4, సర్ ఫేస్ బుక్

Updated on 07-Oct-2015

మైక్రోసాఫ్ట్ తాజాగా నిన్న తన బ్రాండ్ లో డివైజెస్ లాంచ్ చేయటానికి ఈవెంట్ చేసింది. వీటిలో మైక్రోసాఫ్ట్ బ్యాండ్, 3 లూమియా స్మార్ట్ ఫోన్స్ (ఫోన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ లింక్ లో) , Continuum డాకింగ్ స్టేషన్, సర్ ఫేస్ ప్రో 4 టాబ్లెట్, సర్ ఫేస్ బుక్ లాప్ టాప్ ఉన్నాయి.

మైక్రోసాఫ్ట్ బ్యాండ్

ఇది నెక్స్ట్ జెనరేషన్ మైక్రోసాఫ్ట్ బ్యాండ్ 2. దీని ప్రైస్ 16,200 రూ సుమారు. curved గొరిల్లా గ్లాస్ 3 డిస్ప్లే, barometer తో పాటు ఇతర మల్టిపుల్ సేన్సార్స్, ఉన్నాయి.

ఇంత చిన్న బ్యాండ్ లో కంపెని cortana కూడా ఇంటిగ్రేట్ చేసింది. అంటే ముట్టుకోకుండా సిరి లానే బ్యాండ్ కు నోటితో కమేండ్స్ చెప్పి కొన్ని పనులు చేసుకోగలరు.

ఇది ఆండ్రాయిడ్, iOS అండ్ విండోస్ మొబైల్స్ పై పనిచేస్తుంది. అక్టోబర్ 30 న అందుబాటులోకి రానున్న బ్యాండ్ కు ప్రస్తుతం ప్రీ బుకింగ్ కూడా ఇస్తుంది కంపెని.

మైక్రోసాఫ్ట్ డిస్ప్లే డాక్
ఇది విండోస్ 10 os ఉన్న మొబైల్ ను కంప్లీట్ విండోస్ కంప్యుటర్ గా కన్వర్ట్ చేస్తుంది. dock లో 3 usb పోర్ట్స్ ఉన్నాయి. USB టైప్ – C పోర్ట్, HDMI అండ్ డిస్ప్లే పోర్ట్.

మైక్రోసాఫ్ట్ సర్ ఫేస్ ప్రో 4

ఇది టాబ్లెట్. దీనిలో 12.3 in 267PPi డిస్ప్లే, పిక్సెల్ సెన్స్ టెక్నాలజీ, గొరిల్లా గ్లాస్ 4, 8MP కెమేరా, సర్ ఫేస్ పెన్ పేరుతో ఇంప్రూవ్డ్ stylus ఉన్నాయి. సర్ ఫేస్ కు మరొక ఎండ్ లో eraser కూడా ఉంటుంది.

దీనిలో cortana కూడా.. బటన్ hold ప్రెస్ చేసి యాక్సిస్ చేయవచ్చు. ఇది మాగ్నెటిక్ గా టాబ్లెట్ కు అటాచ్ అవుతుంది. దీనిలో 1024 లెవెల్స్ pressures ఉన్నాయి. దీనికి 1 ఇయర్ బ్యాటరీ బ్యాక్ అప్ ఉంది.

సర్ ఫేస్ ప్రో 4 లో TypeCover అనే కొత్త సన్నని మరియు తేలికైన backlit ( కీస్ వెనక లైటింగ్ ఉండేవి) కీ బోర్డ్ ఉంది. దీనిలోనే ఫింగర్ ప్రింట్ సెన్సార్,  గ్లాస్ ట్రాక్ ప్యాడ్ ఉన్నాయి. అక్టోబర్ 7 నుండి ప్రీ ఆర్డర్స్ చేసుకోవచ్చు. అక్టోబర్ 26 న సేల్ అవుతుంది. ప్రైస్ – 58, 600 రూ.

మైక్రోసాఫ్ట్ సర్ ఫేస్ బుక్

మైక్రోసాఫ్ట్ సర్ ఫేస్ బుక్ అనేది హైబ్రిడ్ లాప్ టాప్. దీనిలో రిమూవబుల్ 13.5 in 267PPi డిస్ప్లే, కీ బోర్డ్ డాక్, గ్లాస్ ట్రాక్ ప్యాడ్, సర్ ఫేస్ పెన్ stylus compatibility ఉంటాయి. 

ఇంటెల్ i5 అండ్ i7 ప్రోసేసర్స్ తో 16gb ర్యామ్ GDDR5 ర్యామ్ అండ్ 1TB ఇంబిల్ట్ స్టోరేజ్ దీనిలో ఉన్నాయి. కంపెని ప్రకారం ఇది 12 గంటలు బ్యాటరీ బ్యాక్ వస్తుంది.

కీ బోర్డ్ డాక్ లో NVIDIA GeForce GPU అండ్ 2 usb 3.0 డాక్స్ మరియు sd కార్డ్ స్లాట్ ఉన్నాయి. అక్టోబర్ 26 నుండి సేల్ అవుతుంది. ప్రైస్ – 97,700 రూ.

 

 

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :