Microsoft ప్రతిచోటా వైఫై ఫ్రీ ఇంటర్నెట్ అందుబాటులో తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది.
కొత్త వెంచర్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా వినియోగదారులకు ఇంటర్నెట్ అందించడానికి
మైక్రోసాఫ్ట్ WiFi పేరుతో కొత్త ప్రాజెక్ట్ పై పనిచేస్తుంది మైక్రోసాఫ్ట్. ఇది ప్రస్తుత ఇంటర్నెట్ ప్రాబ్లెమ్స్ కు ఆధునిక టెక్నికల్ సొల్యుషన్ గా ఉండనుంది అని సమాచారం.
మైక్రోసాఫ్ట్ వైఫై తో ద్వారా మీరు వైఫై ఇంటర్నెట్ హాట్ స్పాట్ లకు కనెక్ట్ అవచ్చు. ముందుగా ఇందుకోసం యూజర్స్ దానికి సంబందించిన ఆప్ ను డౌన్లోడ్ చేసుకోవలిసి ఉంటుంది. దాని నుండి మైక్రోసాఫ్ట్ అకౌంట్ కు సైన్ in అయ్యి, ఇంటరెక్టివ్ కనెక్టివిటి మ్యాప్స్ నుండి ప్రపంచం వ్యాప్తంగా ఉన్న వైఫై హాట్స్ స్పాట్స్ ను లొకేట్ చేసి వైఫై కి కనెక్ట్ అవ్వాలి. ఇది ఇంటర్నెట్ వాడకాన్ని సులభతరం చేయనుంది. మైక్రోసాఫ్ట్ స్పోక్స్ పర్సెన్ మాట్లాడుతూ.. "మైక్రోసాఫ్ట్ WiFi ఎటువంటి అవాంతరాలు లేని ఇంటర్నెట్ ను మిలియన్స్ కు ఇవ్వనుంది." అని అన్నారు. అయితే ఇది ఎప్పటికి అందుబాటులో ఉంటుంది అనేదాని పై స్పష్టత ఇంకా లేదు.
దీని అఫీషియల్ వెబ్ సైటు లో ఒక ప్రొమోషన బ్యానర్ లో "ఫార్మ్స్ ను ఫిల్ అప్ చేయటం, పర్సేనల్ సమాచారాన్ని ఇవ్వట, లేదా ఇంటర్నెట్ కోసం నెట్వర్క్లను మారటం లాంటి ఇబ్బందులు ఏమి లేకుండా కేవలం సైన్ in తో సింపుల్ గా ఇంటర్నెట్ కు కనెక్ట్ అవచ్చు. ఒకసారి సైన్ in అవ్వండి, ఇక మర్చిపోండి ప్రపంచంలోని వాస్ట్ ర్యాంజ్ వైఫై ప్రొవైడర్లకు లకు కనెక్ట్ అవ్వండి" అని ఉంది.
అందరూ ఎదురుచూస్తున్న విషయం, ఇది ఫ్రీ సర్వీసు కాదు, కాని ప్రస్తుతం మీరు వాడుతున్న ప్రైవేట్ వైఫై ఇంటర్నెట్ సర్వీసులు కన్నా మెరుగైనది అని అంటుంది మైక్రోసాఫ్ట్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ 365 ఎంటర్ప్రైజ్ కు అనుసంధానం అయ్యి ఉన్న ఆఫీస్ సభ్యులకి మరియు మైక్రోసాఫ్ట్ వర్క్ లేదా ప్లే బండిల్ తో ఉన్న స్క్యైప్ సబ్స్క్రైబర్స్ కి రానుంది లేదా మైక్రోసాఫ్ట్ నుండి ఇన్విటేషన్ వస్తుంది.
ఆధారం: The Verge