Microsoft, స్నాప్ డీల్ తో కలిసి ఆన్లైన్ స్టోర్ లాంచ్ చేసింది
By
Kishore Ganesh |
Updated on 17-Jun-2015
HIGHLIGHTS
మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అన్నీ ఇక్కడ షాపింగ్ చేయవచ్చు
ఇండియాలో ఈ కామర్స్ ఇండస్ట్రీ చాలా ఫాస్ట్ గ్రోత్ రేట్ తో సక్సెస్ ఫుల్ ఇండస్ట్రీ గా నడుస్తుంది. ఇందుకు ప్రధానం కారణం భారతదేశం జనాబా.
ఈ విషయాన్ని స్మార్ట్ కంపెనీలు అన్నీ కనిపెట్టాయి. అందుకే చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు అన్నీ మన ఇండియాకి వచ్చి మార్కెటింగ్ చేస్తున్నాయి. ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టం దిగ్గజం, మైక్రోసాఫ్ట్ ఈ కామర్స్ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టనుంది.
స్నాప్ డీల్ తో కలిపి ప్రత్యేకంగా మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ కోసం స్నాప్ డీల్ వెబ్ సైటు లో ఒక URL లో తన మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్స్ అన్నీ ఆన్ లైన్ లో అమ్మకం చేయనుంది మైక్రోసాఫ్ట్.
టాబ్లెట్స్, లాప్టాప్స్, విండోస్ OS సాఫ్టవేర్ మరియు స్మార్ట్ ఫోన్స్ కొన్ని స్పెషన్ డిస్కౌంట్స్ మరియు ఫ్రీ షిప్పింగ్స్ తో microsoft.snapdeal.com లింక్ లో దొరకనున్నాయి.