Microsoft కొత్త VASA-1 AI టెక్ తో మాములు ఫోటో అవుతుంది మాట్లాడే ఫోటో.!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చెప్పలేనంత వేగంతో దూసుకుపోతోంది
Microsoft తీసుకు వచ్చిన కొత్త AI టెక్నాలజీ VASA-1 ఆవిష్కరణ కూడా వీటిలో ఒకటి
ఈ కొత్త టెక్ తో మీ ఫోటోకు కొత్త సొబగులు ఆపాదించవచ్చు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చెప్పలేనంత వేగంతో దూసుకుపోతోంది. అంతేకాదు, కొత్త AI ఆవిష్కరణలతో మరింత అనూహ్యమైన పరిణాలములు కూడా చూస్తున్నాము. ఇది మన జీవితంలోని వివిధ అంశాలను విశేషమైన మార్గాల్లోకి కూడా మారుస్తుంది. ఇప్పుడు Microsoft నుండి వవచ్చిన కొత్త AI టెక్నాలజీ VASA-1 ఆవిష్కరణ కూడా వీటిలో ఒకటి. ఈ కొత్త టెక్ తో సాధారణమైన మాములు ఫోటోను మాట్లాడే ఫోటోగా మార్చుకోవచ్చు. వినటానికి వింతగా ఉన్నా, ఈ కొత్త టెక్ తో మీ ఫోటోకు కొత్త సొబగులు ఆపాదించవచ్చు.
ఏమిటి ఈ Microsoft VASA-1 AI టెక్?
మైక్రో సాఫ్ట్ VASA-1 అనేది ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ (AI) పై పనిచేసే వర్చువల్ అవతార్ ప్రోగ్రామ్. ఈ కొత్త టెక్ తో మాములు ఫోటోలకు ఆడియో క్లిప్ ను అందించడం ద్వారా మాట్లాడే ఫోటోగా మార్చవచ్చు. అంటే, సెల్ఫీ ఫోటోను + ఆడియో క్లిప్ ను జత అందిస్తే, మైక్రోసాఫ్ట్ యొక్క ఈ కొత్త టెక్ దాన్ని లిప్ షింక్ చేసి మాట్లాడే ఫోటోగా అవుట్ పుట్ అందిస్తుంది.
Also Read: Amazon Summer Sale నుండి లేటెస్ట్ Refrigerator ల పైన గొప్ప డిస్కౌంట్ ఆఫర్లు అందుకోండి.!
ఈ కొత్త టెక్ ఏమి చేస్తుంది ?
మైక్రో సాఫ్ట్ యొక్క ఈ కొత్త టెక్ తో మీరు మీ ఫోటోలను మీకు నచ్చిన విధంగా మాట్లాడే ఫోటోగా మార్చుకోవచ్చు. ఇందులో, జెస్ట్ మీ తో మరియు వాయిస్ క్లిప్ ను అందిస్తే సరిపోతుంది. తర్వాత ఈ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్ ఆ ఫోటోను ఇచ్చిన వాయిస్ క్లిప్ తో షింక్ చేసి దానికి అనుగుణంగా లిప్ మూవ్ మెంట్స్ తో సహా మాట్లాడే ఫోటో గా మారుస్తుంది.
కేవలం లిప్ షింక్ మాత్రమే కాదు, ఈ కొత్త AI టెక్ ఇచ్చిన ఫోటో యొక్క ముఖ కదలికలు, ఫేస్ ఎక్స్ ప్రెషన్స్ మరియు సహజమైన భావాలను కూడా ఇచ్చిన ఫోటోకు జోడిస్తుంది.