మైక్రోసాఫ్ట్ iBall కంపెని తో కలిసి usb స్టిక్ డివైజ్ లో ఫస్ట్ మైక్రోసాఫ్ట్ అతి చిన్న PC ను లాంచ్ చేసింది. దీని పేరు iBall Splendo. దీని ధర 8,999 రూ మాత్రమే.
ఏంటి దీని ఉపయోగం?
HDMI పోర్టులు ఉన్న టీవీ లకు పెన్ డ్రైవ్ మాదిరిగా ఉండే usb స్టిక్ ను కనెక్ట్ చేస్తే మీ టివీ పూర్తిగా కంప్యూటర్ లా మారిపోతుంది. usb స్టిక్ లో ఉన్న మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టం మీ టీవీ ని కంప్యూటర్ పనులను చేసేందుకు మీకు అవకాశం కలిపిస్తుంది. ఈ డివైజ్ తో పాటు వైర్లెస్ కీ బోర్డ్ మరియు మౌస్ వస్తాయి. సో టీవీ ని మానిటర్ గా పెద్ద పెద్ద CPU లు ప్లగ్ ఇన్ చేసే అవసరం లేకుండా చాలా సింపుల్ గా usb ని కనెక్ట్ చేసి PC ఫంక్షన్స్ ను వాడుకోవచ్చు.
iBall Splendo స్పెసిఫికేషన్స్ – ఇంటెల్ ఆటం క్వాడ్ కోర్ ప్రోసెసర్, 2 జిబి ర్యామ్, 32 జిబి ఇంబిల్ట్ స్టోరేజ్, ప్రీ లోడెడ్ విండోస్ 8.1, ఇంటెల్ HD గ్రాఫిక్స్, మైక్రో SDXC కార్డ్ స్లాట్, usb మరియు usb మైక్రో-usb పోర్ట్స్, మల్టీ చానల్ డిజిటల్ ఆడియో, వైఫై, బ్లూటూత్ v4.0 దీనిలో ఉన్నాయి.
జులై మొదటి వారంలో iBall స్ప్లేండో మైక్రోసాఫ్ట్ usb స్టిక్ రిటేల్ అమ్మకాలను ప్రారంభించనుంది