Dirty Stream Attack: భారత్ తో సహా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్ల కొద్దీ Android ఫోన్ యూజర్లకు కొత్త మాల్వేర్ హింట్ ఇచ్చిన మైక్రోసాఫ్ట్. ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్ల సెక్యూరిటీ కి భంగం కలిగించే చాలా మాల్వేర్లను గురించి ఇప్పటికే మనం విన్నాం. అయితే, డర్టీ స్ట్రీమ్ అటాక్ అనే కొత్త మాల్వేర్ ఎటాక్ గురించి మైక్రోసాఫ్ట్ ప్రపంచానికి హింట్ ఇచ్చింది. కేవలం హింట్ ఇవ్వడమే కాదు, దీనికోసం ఇతర కంపెనీలతో కలిసి పని చేసినట్లుగా తెలిపింది.
వల్నరబుల్ అప్లికేషన్ హోమ్ డైరెక్టరీ నుండి ట్రావర్సల్-అనుబంధ వల్నేరబిలిటీ ప్యాట్రన్ లను అనేక ఆండ్రాయిడ్ యాప్స్ కలిగి ఉన్నట్లు మైక్రోసాఫ్ట్ గుర్తించింది. ఇది ఆర్బిటరీ కోడ్ ఎగ్జిక్యూషన్ మరియు టోకెన్ దొంగతనం కూడా చేస్తుంది. దీన్ని సింపుల్ గా విడమరిచి చెప్పాలంటే, ఈ మాల్వేర్ ను కలిగిన యాప్స్ ఈ ఫోన్ యొక్క పూర్తి కంట్రోల్ ను ఎటాకర్ల చేతికి అందిస్తుంది.
అంటే, ఆండ్రాయిడ్ యూజర్ల యొక్క సున్నితమైన డేటా చిక్కుల్లో పడే అవకాశం ఈ డర్టీ స్ట్రీమ్ ఎటాక్ ద్వారా కలుగుతుంది.
అయితే, ఈ ఎటాక్ కు సహకరించేలా ఉన్న చాలా వల్నరబుల్ యాప్స్ ను గురించి మైక్రోసాఫ్ట్, రెస్పాన్స్ డిస్క్లోజర్ పాలసీ ద్వారా ఆ అప్లికేషన్ డెవలపర్ల దృష్టికి ఈ విషయాన్ని తీసుకు వచ్చింది. ఈ విషయాన్ని మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ బ్లాగ్ పేజీ నుండి వివరాలతో పోస్ట్ చేసింది మైక్రోసాఫ్ట్.
ఈ ఎటాక్ థ్రెట్ ను గుర్తించిన కంపెనీ, మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ వల్నరబిలిటీ రీసెర్చ్ (MSVR) తో కోఆర్డినేటెడ్ వల్నరబిలిటీ డిస్క్లోజర్ (CVD) ద్వారా ఈ సమస్యకు గుర్తించడానికి డెవలపర్ లతో కలిసి పని చేసినట్లు తెలిపింది.
ఈ సమస్యను గుర్తించడానికి మరియు దానిని సరిచేయడానికి సహకరించిన Xiaomi మరియు WPS Office సెక్యూర్టీ టీమ్స్ కి ధన్యవాదాలు కూడా తెలిపింది. అంతేకాదు, యాప్స్ ను అప్డేట్ చేయడం ద్వారా కొత్త అప్డేట్ లతో సమస్యను అధిగమించే అవకాశం ఉంటుందని కూడా తెలిపింది.
Also Read: Amazon Sale జబర్దస్త్ ఆఫర్: భారీ డిస్కౌంట్ తో 8 వేలకే లభిస్తున్న లేటెస్ట్ Poco 5G ఫోన్.!
సింపుల్ గా చెప్పాలంటే, ఆండ్రాయిడ్ యాప్స్ కంటెంట్ ప్రొవైడర్ సిస్టమ్ పైన పని చేస్తాయి.ఈ కొత్త డర్టీ స్ట్రీమ్ తో యాప్స్ మరొక యాప్స్ తో వారి డేటాని షేర్ చేసే వల్నరబుల్ ను కలిగి ఉంటాయి. అందుకే, ఈ మాల్వేర్ తో ఆండ్రాయిడ్ యూజర్ల సెక్యూరిటీ చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది.
అయితే, డెవలపర్ దృష్టికి ఈ సమస్యను తీసుకు వచ్చిన మైక్రోసాఫ్ట్ దానికి తగిన సొల్యూషన్ ను వెతికే పనిలో సాగేలా ఆ డెవలపర్లకు సహాయం చేసింది.