జులై 29 విండోస్ 10 OS విడుదల: మైక్రోసాఫ్ట్

Updated on 02-Jun-2015
HIGHLIGHTS

విండోస్ 7 మరియు 8 యూజర్స్ (పైరేటెడ్ లేదా జెన్యూన్) కు కూడా విండోస్ 10 ఫ్రీ అపగ్రేడ్ గా వస్తుంది.

మైక్రోసాఫ్ట్ విండోస్ 10 వెర్షన్ ను జులై 29 న రిలీజ్ చేస్తుంది అని తాజాగా అనౌన్స్ చేసింది. అయితే విండోస్ 7, 8 పైరేటెడ్ యూజర్స్ కు వస్తున్న విండోస్ 10 ఫ్రీ అపగ్రేడ్ కూడా పైరేటెడ్ మోడ్ లోనే ఉంటుంది. అప్ గ్రేడ్ చేసుకున్నాక జెన్యూన్ అవదు.

ఇప్పటికే కొంత మంది PC యూజర్స్ కు విండోస్ 10 ఇంస్టాల్ చేసుకోమని అప్ డేట్ మెసేజ్ వస్తుంది అట. రెడ్డిట్ట్ట్ యూజర్ (P4block) ముందుగా ఈ విషయాన్ని చెప్పగా, తరువాత చాలా మందికి అప్ డేట్ మెసేజ్ వచ్చినట్టు చెప్పారు.

విండోస్ 10 లో కార్టానా వాయిస్ అసిస్టెంట్ ను ప్రీ ఇంస్టాల్ చేసింది మైక్రోసాఫ్ట్. అలాగే కొత్త బ్రౌజర్- మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ మరియు సరి కొత్త విండోస్ డిఫెండర్ (ఏంటి వైరస్ ప్రోటేక్షన్) లు విండోస్ 10 లో హైలైట్స్. ఇవే కాకుండా కొత్త ఫోటోస్, మ్యూజిక్, మ్యాప్స్, మెయిల్, కేలండర్ ఆప్స్ ను జోడించింది విండౌస్ 10. "స్టార్ట్ మెను తిరిగి పెట్టడం నుండి చాలా ఫీచర్స్ మరింత పర్సనేల్, ఫన్ మరియు ఉపయోగకరమైన ఎక్సిపిరియన్స్ విండౌస్ 10 లో పొందుతారు." అని మైక్రోసాఫ్ట్ ప్రెస్ రిలీజ్ లో చెప్పింది.

ఫ్రీ విండోస్ 10 ఎలా పనిచేస్తుంది అనేది మైక్రోసాఫ్ట్ ఇలా వివరించింది:  
1. ముందుగా ఫ్రీ అపగ్రేడ్ ను ఇప్పుడే మీరు రిసర్వ్ చేసుకుంటే, OS రిలీజ్ అయినప్పుడు, మీకు ఆటోమాటిక్ గా డౌన్లోడ్ అవుతుంది. అలాగే రిసర్వ్ చేసుకున్న స్ల్లాట్ ను మీకు డౌన్లోడ్ చేసుకోవడం ఇష్టం లేకపోతే ఎప్పుడైనా కేన్సిల్ చేసుకోవచ్చు.
2. విండౌస్ 10 యూజర్స్ కంప్యూటర్ లోకి డౌన్లోడ్ అయిపోయాక, యూజర్ కు నోటిఫికేషన్ వస్తుంది. వెంటనే దానిని ఇంస్టాల్ చేసుకోవచ్చు లేదా యూజర్ టైమ్ ప్రిఫెరేన్స్ ను బట్టి ఎప్పుడైనా ఇంస్టాల్ చేసుకోవచ్చు.
3. ఇంస్టాల్ అయ్యాక, డైరెక్ట్ గా ఇక విండోస్ 10 ను వాడుకునే అవకాశం ఉంది.

అందరికి అందుబాటులో ఉన్న ఈ ఫ్రీ అపగ్రేడ్ ఫుల్ వెర్షన్ విండోస్ 10 ను ఇస్తుంది. దీని సైజు 3జిబి ఉంటుంది. అయితే విండోస్ 10 ఫ్రీ అప్ గ్రేడ్ కేవలం ఒక సంవత్సరం పాటు ఫ్రీ గా ఉండనుంది, ఆ తరువాత విండోస్ 10 అప్ డేట్ కి కొంత అమౌంట్(ఇంకా నిర్ణయించలేదు) ను మైక్రోసాఫ్ట్ కు పే చేయాలి. తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంటు కు కొన్ని గంటల ముందు Newegg.com వెబ్ సైటు విండోస్ 10 ప్రైసింగ్ వివరాలను బయటకు లీక్ చేసింది. Newegg.com ప్రకారం ప్రొఫెషనల్ వెర్షన్ 9500/- రూ. మరియు హోం ఎడిషన్ 7000/- రూ. లకు లభిస్తాయి. మైక్రోసాఫ్ట్ విండోస్ 10 ను లో కాస్ట్ డివైజ్ ల నుండి హై ఎండ్ కంప్యూటర్ మరియు స్మార్ట్ ఫోన్స్ కు విస్తరించేందుకు ప్లానింగ్ చేసుకుంటుంది. వచ్చే మూడు సంవత్సరాలలో బిలియన్ డివైజ్ లలో విండోస్ ఉండాలని చూస్తుంది మైక్రోసాఫ్ట్. 

                                                                                                                                                                                                                                                   
  
                                 
 

                                             

Silky Malhotra

Silky Malhotra loves learning about new technology, gadgets, and more. When she isn’t writing, she is usually found reading, watching Netflix, gardening, travelling, or trying out new cuisines.

Connect On :