తక్కువ ధరకు ఇంటర్నెట్ ను అందించటానికి ఆంధ్రప్రదేశ్ – మైక్రోసాఫ్ట్ ఒప్పందాలు

Updated on 17-Aug-2015
HIGHLIGHTS

దేశంలోనే మొదటి సారిగా కొత్త టెక్నాలజీ తో

టెక్నాలజీ దిగ్గజం, మైక్రోసాఫ్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తో తక్కువ ధరలకే ఇంటర్నెట్ ను అందించటానికి ఒప్పొందం కుదుర్చుకుంది. TV వైట్ స్పేస్ టెక్నాలజీ ద్వారా ఈ ప్రాజెక్ట్ నడుస్తాది. దేశంలోనే ఇది మొదటి సారి ప్రయోగాత్మకంగా వాడుతున్న టెక్నాలజీ. మొన్న శుక్రవారం చీఫ్ మినిస్టర్ చంద్రబాబు మరియు మైక్రోసాఫ్ట్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, అనిల్ భన్సాలి మధ్య ఇది అప్ప్రూవ్ అయ్యింది.

మైక్రోసాఫ్ట్, DOT, ERNET అండ్ DEITY ఈ pilot ప్రాజెక్ట్ పై పనిచేస్తున్నాయి. మొదటిగా శ్రీకాకుళం జిలాలో నాలుగు విద్యా సంస్థలలో ఇది ప్రారంభం కానుంది. వీటిలో ఒక ZP హై స్కూల్ బేస్ స్టేషన్ లా ఉండి దాని నుండి మిగిలిన 3 స్కూళ్ళకు ఇంటర్నెట్ ను అందించే ప్లాన్ సిద్దం చేసుకున్నారు.

TV స్పేస్ టెక్నాలజీ లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే మాముల WiFi లా 100మీటర్లు పరిధిలో కాకుండా 10 కిలోమీటర్ల వరకూ ఈ ఇంటర్నెట్ పనిచేస్తుంది. అయితే ఇది ముఖ్యంగా విద్యా సంస్థలలో టీచింగ్ కొరకు ఉపయోగిస్తున్న ప్రాజెక్ట్.

ఇంతకముందు ఇదే టెక్నాలజీ నమీబియా, టాంజానియా, సింగపూర్, కెన్యా, సౌత్ఆఫ్రికా, ఘానా మరియు Botswana దేశాలలో ఉపయోగించింది మైక్రోసాఫ్ట్. ఆంధ్రప్రదేశ్ లో ముందు xiaomi made in india ప్లాంట్ ను నెలకొలిపి రెడ్మి 2 prime అనే మోడల్స్ ను తయారు చేసి సేల్స్ ను చేస్తుంది. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కొత్త ప్రాజెక్ట్ ఒప్పొందం. 

Connect On :