కెనడా కి చెందిన స్మార్ట్ ఏఆర్ఎమ్ ను 16 వ మైక్రో సాఫ్ట్ ఇమాజిన్ కప్ టోర్నమెంట్ యొక్క విజేతగా ప్రకటించింది, భారతీయ జట్టు ప్రత్యేక బహుమతిని చేజిక్కించుకుంది
సరసమైన కృత్రిమ రోబాటిక్ చేతి అవయవాన్ని రూపొందించి నందుకు గాను స్మార్ట్ ఏఆర్ఎమ్ $85,000 లను బహుమతిగా పొందింది . ఒక గొప్ప డేటాను సేకరించి తమ ప్రాజెక్టును నిర్మించి నందుకు గాను డ్రగ్ సేఫ్ టీం $15,000 మొత్తాన్ని గెలుచుకుంది.
రెడ్మాండ్ యూ ఎస్ లో ఉన్నహెడ్ క్వార్టర్స్ జరిగిన ఫైనల్స్ లో మైక్రో సాఫ్ట్ కంపెనీ తన 16 వ ఇమాజిన్ కప్ విజేత గా కెనడా కి చెందిన స్మార్ట్ఎఆర్ఎమ్ టీం ని ప్రకటించింది . ఈ టీం మైక్రో సాఫ్ట్ అజూర్ కంప్యూటర్ విజన్ ని ఉపయోగించుకొనిమెషిన్ లెర్నింగ్ మరియు క్లవుడ్ స్టోరేజి చేయగల సరసమైన కృత్రిమ రోబాటిక్ చేతి అవయవాన్ని రూపొందించినది. అరచేతిలో అమర్చిన ఒక కెమెరా సహాయంతో ఈ కృత్రిమ రోబాటిక్ చేయి వస్తువులను గుర్తించగలగడమే కాకుండా వస్తువు సరైన విధంగా పెట్టుకునేలా సహాయపడుతుంది. మైక్రో సాఫ్ట్ సిఇఓ అయినటువంటి సత్య నాదెళ్ల గారితో మార్గదర్శిక సమావేశంలో పాల్గొనే అవకాశం తో పాటుగా $85,000 మొత్తం మరియు $50,000 అజూర్ గ్రాంట్ ను కూడా పొందారు .
శిశువు ఏడుస్తున్నప్పుడు అదేసమయంలో శిశువు యొక్క తల్లితదండ్రులకు అనువదించడానికి నాన్ -ఇన్వసివ్ ఇంటర్ఫేస్ అదికూడా తక్కువ ధరలో అందుబాటులోకి తెచ్చినందుకు గ్రీస్ కి చెందినటువంటి ఐ క్రై2టాక్ రెండవ స్థానం లో నిలిచింది. ఈ ఇంటర్ఫేస్ శిశువు యొక్క ఏడుపును ఒక నిర్దిష్ట శరీరధర్మం మరియు మానసిక స్థితి ని టెక్స్ట్ ,ఇమేజి మరియు వాయిస్ మెసేజ్ రూపంలో అందిస్తుంది. మీడియట్ ఇయర్ ని రూపొందించి నందుకు గాను జపాన్ కి చెందిన మీడియట్ ఇయర్ టీమ్ మూడవ స్తానం లో నిలిచింది . ఇది వినికిడి లోపం ఉన్నవారు ఒక సమూహంగ మాట్లాడుతున్న వారిలో ఒక వ్యక్తి యొక్క మాటల మీద ద్రుష్టి సారించే విధంగా తయారుచేసిన ఒక సాఫ్ట్ వేర్ . లోతైన అభ్యాసం ద్వారా ఆడియో ధ్వనితరంగాల లోని నిర్దిష్ట ధ్వనులను ప్రసారం చేయగల ప్రసారం ఈ మీడియేట్ ఇయర్.
ఈ సంవత్సరం జరిగిన ఇమాజిన్ కప్, లో మైక్రో సాఫ్ట్ డిజిటల్ పరివర్తన ముఖ్య ఉదేశ్యం పొందుపరిచిన మూడు ప్రాజెక్టులకు $15,000 లను ప్రత్యేక బహుమతిగా ప్రకటించింది. అందులో భాగంగా:ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (AI),బిగ్ డేటా మరియు మిక్సిడ్ రియాలిటీ లు ఎంపికైయ్యాయి . నేపాల్ కి చెందిన సంవేర్ (sochware) AI అవార్డుని గెలుచుకుంది,ఉపశమన వ్యూహాలు వ్యవసాయం లో మొక్కలకి వచ్చే వ్యాదులు గుర్తించడానికి ,నిపుణులతో అనుసంధానం అయ్యి వారి యొక్క సలహాలు మరియు సూచనలు అందుకునే వీలే కాకుండా కొత్తగా జరిగిన వ్యవసాయ అన్వేషణలతో అప్డట్ చేస్తుంది. వేర్వేరు ప్రాంతాల చెందిన ఇంజనీర్లను అవసరమైనప్పుడు ఒక కార్యాస్తలానికి పిలిచే ఒక పరిష్కారం గా "టెలీపోర్టెడ్" ని నిర్మించి యు ఎస్ కి చెందిన పెంగ్గ్రామ్ మిశ్రమ రియాలిటీ అవార్డును గెలుచుకుంది.
వాస్తవమైన వాడదగిన మందులు మరియు నకిలీ మందులు వాడటం వలన అనారోగ్యం పొందటాన్నీ తగ్గించడానికి కోసం పరిస్కారాన్ని కనుగొన్న భారతదేశానికి చెందిన డ్రగ్ సేఫ్ టీమ్ (ఆర్ .వీ .కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ,బెంగళూరు కి చెందిన చిద్రూప్ ఐ ,ప్రతీక్ మోహాపాత్ర మరియు శ్రీహరి హెచ్ఎస్) బిగ్ డేటా అవార్డును గెలుచుకుంది .మన దేశం నుంచి ప్రాతినిధ్య వహించే మూడు టీమ్ లలో ఇదీ ఒకటి . ఆప్టికల్ క్యారెక్టర్ రికగ్నిషన్ (OCR) ను ఉపయోగించుకొని మందు యొక్క రూపకల్పన మరియు ప్యాకేజింగ్ యొక్క మినిట్స్ వివరాలను గుర్తించడానికి మరియు అసలైన తయారీదారు యొక్క పేటెంట్ మరియు ట్రేడ్మార్క్డ్ వివరాలతో వాటిని సరిపోల్చడానికి ను డ్రగ్సేఫ్ ఆప్ ఒక మాధ్యమంగా పనిచేస్తుంది . మూడు అంచెల తనిఖీ నిర్వహించిన తరువాత వచ్చిన వ్యత్యాసాలను గుర్తిస్తుంది , తద్వారా వినియోగదారులు నకిలీ మందులు గుర్తించే వీలుంది .
మైక్రో సాఫ్ట్ ఇమాజిన్ కప్ అనేది AI ,బిగ్ డేటా ,మిక్సెడ్ రియాలిటీ ,ఇంకా ఇలాంటి క్లవ్డ్-బేస్డ్ సాంకేతికతను ఉపయోగించుకుని అందరికి ఉపయోగపడే ప్రొజెక్ట్స్ చేయగలిగిన విద్యార్థులు ప్రపంచ నలుమూలల నుంచి పాల్గొనే వీలున్న ఒక పోటీ . ఈ పోటీ ఆరంభం నుండి, దాదాపు 190 దేశాలకు చెందిన 20 లక్షల మంది విద్యార్థులు ఈ పోటీ లో పాల్గొన్నారని అంచనా .
కవర్ చిత్రం శీర్షిక: 2018 ఇమాజిన్ కప్ ప్రపంచ ఛాంపియన్స్ కిరీటాన్ని పొందిన స్మార్ట్ఎఆర్ఎమ్ జట్టుతో సత్య నాదెళ్ల తో పాటుగా ప్రత్యేక అతిధిగా విచ్చేసిన ఒలింపిక్ స్నోబోర్డింగ్ స్వర్ణ పతక విజేత క్లోఏ కిమ్ ఉన్నారు .