సెలెబ్రెటీస్ ఫేస్ తో వచ్చే ఫేక్ యాడ్స్ గుర్తించడానికి Facial Recognition ఫీచర్ తెస్తున్న Meta
ఆన్లైన్ మోసాలు అరికట్టడానికి Meta కూడా కంకణం కట్టుకుంది
సెలెబ్రెటీస్ ఫేక్ యాడ్స్ గుర్తించడానికి Facial Recognition ఫీచర్ టెస్టింగ్ చేస్తోంది
ఆన్లైన్ మోసాలలో సెలెబ్రేటిస్ AI ఫిషియల్ ఫేక్ యాడ్స్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు అరికట్టడానికి Meta కూడా కంకణం కట్టుకుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మరింత విస్తృతంగా పెరుగుతున్న తరుణంలో మోసాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. గత కొంత కాలంగా సెలెబ్రెటీస్ ఫేస్ లను జోడిస్తూ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో వస్తున్న యాడ్స్ పెరిగి పోయాయి. వీటి బారిన పడిన వారు ఇప్పటికే మొత్తుకుంటున్నారు. అయితే, ఇటువంటి మోసాలు జరగకుండా అడ్డుకట్ట వేయడానికి వీలుగా Meat కొత్తగా సెలెబ్రెటీస్ ఫేక్ యాడ్స్ గుర్తించడానికి వీలుగా Facial Recognition ఫీచర్ ను టెస్టింగ్ చేస్తోంది.
Meta Facial Recognition : ఫీచర్
యాంటీ స్కామ్ ప్రధానాంశంగా మెటా కొత్త ఫీచర్లను టెస్ట్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఆన్లైన్ మోసాలలో సెలెబ్రేటిస్ AI ఫిషియల్ ఫేక్ యాడ్స్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి. AI ఫేషియల్ ను ఉపయోగించి నిర్మించిన వీడియోలు మరియు యాడ్స్ తో స్కామర్లు ప్రజలను దోచుకుంటున్నారు. అయితే, ఇటువంటి మోసాలు జరగకుండా మెటా అడ్డుకట్ట వేయడానికి ఈ కొత్త ఫీచర్ ను పరీక్షిస్తోంది.
మెటా కొత్తగా టెస్ట్ చేస్తున్న ఫేషియల్ రికగ్నేషన్ ఫీచర్ సెలెబ్రేటిస్ సెంట్రిక్ ఫేక్ యాడ్స్ ను ఫిషియల్ రికగ్నేషన్ ద్వారా పసిగడుతుంది. ఇలా చేయడం ద్వారా ఆ వీడియో నిజంగానే వారు యాక్ట్ చేసిందా లేకపోతే AI ద్వారా నిర్మించిందో అనేది తేలిపోతుంది.
ఈ విషయాన్ని మెటా యొక్క కంటెంట్ పాలసీ వైస్ ప్రెసిడెంట్ మోనికా బికెర్ట్ వెల్లడించారు. ఈ ఫీచర్ ద్వారా Facebook మరియు Instagram లో స్కామర్లు అందించే బోగస్ యాడ్స్ బెడద నుంచి యూజర్లను రక్షించడానికి, మెషిన్ లెర్నింగ్ స్కాన్స్ ఈ యాడ్స్ ను గుర్తించి అడ్డుకుంటాయని తెలిపారు.
Also Read: 11 వేలకే 16GB స్టోరేజ్ మరియు సూపర్ సౌండ్ అందించే QLED Smart Tv అందుకోండి.!
యూజర్లను మభ్యపెట్టడానికి సమాజంలో గొప్ప పేరు ప్రఖ్యాతులు కలిగిన పబ్లిక్ ఫిగర్ ఇమేజ్ మరియు వీడియోలతో స్కామర్లు ఫేక్ యాడ్స్ ఉపయోగిస్తున్నారు. ఈ కొత్త రకం స్కామ్ లను “Celeb-Bait’ గా పిలుస్తారు మరియు ఈ స్కామ్ లు ఈ మధ్య ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటివంటి స్కామ్ లను నివారించడానికి మెటా ఈ కొత్త ఫీచర్ ను తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ఈ కొత్త ఫీచర్స్ ను టెస్ట్ చేసింది మరియు త్వరలోనే వాడుకలోకి తీసుకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.