ఆర్టిఫీషియల్ ఇంటిలిజెన్స్ పైన మార్కెట్ లో కొనసాగుతున్న కాంపిటేషన్ అంతా ఇంతా కాదు. ప్రతి ఒక్క యాప్ మరియు పెద్ద పెద్ద ప్లాట్ ఫామ్స్ సైతం ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ను తమ ప్లాట్ ఫామ్ లకు జత చెయ్యడానికి క్యూ కడుతున్నాయి. ఇప్పుడు అతిపెద్ద ప్లాట్ ఫామ్ meta కూడా ఇదే దారిపట్టింది. అత్యంత ప్రజాధరణ పొందిన Facebook మరియు Instagram కోసం AI ఆధారిత వీడియో ఎడిటింగ్ టూల్ సిద్ధం చేసింది. యూజర్లకు మరింత అద్భుతమైన అనుభూతిని అందించడానికి మెటా కృషి చేస్తోంది.
Facebook మరియు Instagram కోసం మెటా కొత్తగా ఎఐ ఆధారిత వీడియో ఎడిటింగ్ ఫీచర్ ను తీసుకు వచ్చింది. Emu Edit మరియు Emu Video పేరుతొ తీసుకు వచ్చిన ఈ టూల్ తో యూజర్లు కొత్త అనుభూతిని పొందవచ్చు. ఈము తో కొత్త ఇమేజ్ లను క్రియేట్ చేయవచ్చు మరియు ఫోటోల వెనుక విజువల్ స్టైల్ బ్యాగ్రౌండ్ లను కూడా క్రియేట్ చేసే వీలుంది.
ఈము సాంకేతికతతో చాలా జెనరేటివ్ ఎఐ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. ఇన్స్టాగ్రామ్ లో ఎఐ ఇమేజ్ ఎడిటింగ్ టూల్ ద్వారా ఫోటోల బ్యాగ్రౌండ్ లను మరింత వర్ణాత్మకంగా మార్చుకోవచ్చు. అలాగే, సింపుల్ మెసేజె ల ద్వారాఫోటో రియలిస్టిక్ ఇమేజ్ లను కూడా డైరెక్ట్ గా క్రియేట్ చేసుకోవచ్చు.
Also Read : Lava Agni 2s: త్వరలోనే మార్కెట్ లో లావా కొత్త బడ్జెట్ 5G స్మార్ట్ ఫోన్.!
మీరు ఇంతక మునుపు ఎఐ ఇమేజ్ జెనరేటివ్ టూల్ ను ఉపయోగించ పోయినా ఈ కొత్త టూల్ అద్భుతమైన రిజల్ట్స్ ను చూడవచ్చని మెటా చెబుతోంది. ఈ టూల్ ద్వారా అత్యంత స్టయిలిష్ మరియు డిటైల్స్ కలిగిన ఇమేజ్ లను సొంతంగా క్రియేట్ చేసుకోవచ్చు. అలాగే, వాటికి మూమెంట్స్ ను అందించడం ద్వారా వాటికీ జీవితాన్ని ఇవ్వవచ్చని కొద మెటా చెబుతోంది.
ఈ ఈము వీడియో టూల్ చాలా సింపుల్ పద్ధతితో వస్తుంది. ఇది text-to-video ఆధారిత ఆవిష్కరణ మోడల్స్ ను అందిస్తుంది. ఇది చాలా రకాల ఇన్ పుట్స్ కు రెస్పాండ్ అవుతుంది. ఇందులో టెక్స్ట్ ఓన్లీ, ఇమేజ్ ఓన్లీ మరియు టెక్స్ట్ అండ్ ఇమేజ్ రెండింటికి రెస్పాండ్ అవుతుందని కూడా మెటా తెలిపింది.