వాట్సాప్ యూజర్లకు గ్రేట్ న్యూస్ తెలిపిన మార్క్ జూకర్ బర్గ్.!

వాట్సాప్ యూజర్లకు గ్రేట్ న్యూస్ తెలిపిన మార్క్ జూకర్ బర్గ్.!
HIGHLIGHTS

మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ వాట్సాప్ యూజర్ల కోసం గ్రేట్ అనౌన్స్ మెంట్ చేశారు

Whatsapp లో ఇక నుండి HD Photo లను నేరుగా పంపించవచ్చని Facebook సాక్షిగా ప్రకటించారు

మార్క్ జూకర్ బర్గ్ ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ నుండి పోస్ట్ చేశారు

మెటా అధినేత మార్క్ జూకర్ బర్గ్ వాట్సాప్ యూజర్ల కోసం గ్రేట్ అనౌన్స్ మెంట్ చేశారు. మార్క్ జూకర్ బర్గ్ తన ఫేస్ బుక్ అకౌంట్ నుండి ఈ గుడ్ న్యూస్ ను ప్రకటించారు. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించబడుతున్న మెసేజింగ్ యాప్ Whatsapp లో ఇక నుండి HD Photo లను నేరుగా పంపించవచ్చని Facebook సాక్షిగా ప్రకటించారు. నిన్న గురువారం నాడు మార్క్ జూకర్ బర్గ్ ఈ విషయాన్ని తన ఫేస్ బుక్ అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. 

'వాట్సాప్ లో ఫొటోస్ సెండ్ చెయ్యడంలో కొత్త అప్గ్రేడ్.. ఇప్పుడు మీరు HD లో పంపవచ్చు'  అని అర్ధంతో జూకర్ బర్గ్ పోస్ట్ పెట్టారు. ఈ అప్షన్ ఈరోజు నుండి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్న వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి కూడా వచ్చింది. అయితే, మీరు పంపించే ఫోటో డిఫాల్ట్ గా స్టాండర్డ్ ఫోటో సెండ్ చేయబడుతుంది. HD క్వాలిటీలో ఫోటో సెండ్ చేయలనుకుంటే మీరు HD ఫోటో అప్షన్ ను ఎంచుకోవలసి ఉంటుంది. 

వాట్సాప్ లో HD Photo లను ఎలా పంపాలి?

ఇది చాలా సింపుల్ మరియు మీరు రెగ్యులర్ గా ఫోటోలను సెండ్ చేసినట్లుగానే చేయ్యవచ్చు. మీ వాట్సాప్ అకౌంట్ ను మీరు HD ఫోటో సెండ్ చేయాలంటే, ఫోటో సెండ్ చేసేప్పుడు ఫోటో సెలక్ట్ చేసే పైన కనిపించే HD ని సెలెక్ట్ చెయ్యాల్సి ఉంటుంది. అయితే, మీరు పంపించే ఫోటో క్వాలిటీ మరియు క్లారిటీ ని బట్టి ఫోటో HD అప్షన్ మీకు కనిపిస్తుంది. 

మీరు ఒకటి కంటే ఎక్కువ ఫోటోలను కూడా HD లో పంపించవచ్చు. దీనికోసం మీరు ఫోటోలు సెలక్ట్ చేసిన తరువాత పైన కనిపించే HD అప్షన్ ను ఎంచుకోవాలి. అంతే, మీరు ఎంచుకున్న ఫోటోలు HD లో సెలక్ట్ అవుతాయి. ఫోటోలు ఎంచుకున్న తరువాత మీకు HD మరియు Standard ఫోటోల రిజల్యూషన్ ను చూపిస్తుంది. ఇందులో మీరు HD ని ఎంచుకోవాలని గుర్తుంచుకోండి. 

మీరు HD అప్షన్ ను ఎంచుకోక పోయినట్లయితే మీ ఫోటోలు స్టాండర్డ్ లో డిఫాల్ట్ గా సెండ్ చెయ్యబడతాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo