ప్రముఖ చిప్ సెట్ తయారీదారు MediaTek కొత్త ఫ్లాగ్ షిప్ కిల్లర్ Dimensity 9300 చిప్ సెట్ లాంచ్ చేసింది. డైమన్సిటీ 9000 సిరీస్ నుండి చాలా పవర్ ఫుల్ చిప్ సెట్ లను తీసుకు వచ్చిన మీడియాటెక్, ఇప్పుడు నెక్స్ట్ జెనరేషన్ చిప్ సెట్ డైమన్సిటీ 9300 చిప్ సెట్ ను పవర్ ఫుల్ AI మరియు హైబ్రిడ్ AI కంప్యూటింగ్ కేపబిలిటీస్ తో తీసుకు వచ్చినట్లు మీడియాటెక్, ఈ చిప్ సెట్ గురించి గొప్పగా చెబుతోంది.
మీడియాటెక్ నెక్స్ట్ జెనరేషన్ డైమెన్సిటీ 9300 చిప్ సెట్ చాలా శక్తివంతమైన ప్రోసెసర్ మరియు ఉన్నతమైన AI పెర్ఫార్మెన్స్ తో పాటుగా మరింత ఎనర్జీ సేవ్ చేస్తుందని మీడియాటెక్ తెలిపింది. ఈ చిప్ సెట్ స్పెక్స్ మరియు దీని సామర్ధ్యాలను వివరంగా చూద్దాం.
Also Read : Jio Diwali Offer: ఈ రీఛార్జ్ చేస్తే 23 రోజుల వ్యాలిడిటీ మరియు డేటా ఉచితం.!
డైమెన్సిటీ 9300 అనేది ఆక్టా కోర్ చిప్ సెట్ మరియు ఇది TSMC మూడవ జెనరేషన్ 4nm ప్రోసెసర్. ఈ పవర్ ఫుల్ ప్రోసెసర్ 4 Arm Cortex-X4 కోర్స్ మరియు 4 Cortex-A720 కోర్స్ తో గరిష్టంగా 3.25GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. ఈ చిప్ సెట్ WQHD ని 180Hz పీక్ రిఫ్రెష్ రేట్ వరకూ 4K కంటెంట్ ను 120Hz రిఫ్రెష్ రేట్ తో అందించ గలదు. అంటే, అద్భుతమైన విజువల్స్ ను స్మార్ట్ ఫోన్ లో చూసే అవకాశం అందిస్తుంది.
ఈ చిప్ సెట్ కెమేరా పనితనాన్ని కూడా మరింతగా పెంచుతుంది. ఇందులో ఉన్న low-power AI-ISP పనితనం మరియు నిరంతరం ఆన్ లో వుండే HDR, 4K రిజల్యూషన్ వీడియోలను 60 fps వద్ద మరియు సినీమ్యాటిక్ మోడ్ తో రియల్ టైం బొకే 4K వీడియోలను 30fps వద్ద చిత్రీకరించే సత్తా కలిగి ఉంటుంది.
డైమెన్సిటీ 9300 చిప్ సెట్ Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది మరియు 6.5 Gbps వరకు స్పీడ్ అందిస్తుంది. అలాగే, ఇది 5G R16 మోడెమ్ తో వేగవంతమైన నెట్ స్పీడ్ ను అందించ గలదు. ఇప్పటి వరకూ అత్యంత వేగవంతమైన LPDDR5T 9600Mbps మెమోరి సపోర్ట్ తో ఈ చిప్ సెట్ వస్తుంది.