MediaTek Dimensity 9400 చిప్ సెట్ ను అల్టిమేట్ AI ఫీచర్స్ తో అనౌన్స్ చేసిన మీడియాటెక్.!

MediaTek Dimensity 9400 చిప్ సెట్ ను అల్టిమేట్ AI ఫీచర్స్ తో అనౌన్స్ చేసిన మీడియాటెక్.!

MediaTek Dimensity 9400 చిప్ సెట్ ను అనౌన్స్ చేసింది. ప్రముఖ చిప్ సెట్ తయారీ కంపెనీ మీడియాటెక్ ఈ కొత్త చిప్ సెట్ ను అనౌన్స్ చేసింది. ఈ కొత్త చిప్ సెట్ Next-gen Generative AI tech తో తీసుకు వచ్చినట్లు మీడియాటెక్ తెలిపింది. మొబైల్ రంగంలో పెరుగుతున్న పోటీకి అనుగుణంగా ఈ కొత్త చిప్ సెట్ ను అందించింది. ఈ కొత్త చిప్ సెట్ వేగవంతమైన కనెక్టివిటీ, సూపర్ పెర్ఫార్మెన్స్ మరియు AI సత్తా తో ఆకట్టుకుంటుంది.

MediaTek Dimensity 9400 : ఫీచర్స్

మీడియాటెక్ లేటెస్ట్ గా విడుదల చేసిన Dimensity 9400 చిప్ సెట్ బిగ్ కోర్ CPU ను కలిగి ఉంటుంది. ఇది 3.62GHz క్లాక్ స్పీడ్ కలిగిన కొత్త Arm Cortex-X925 కోర్ తో ఉంటుంది. ఇది సింగిల్ కోర్ పై 35% వేగవంతమైన పెర్ఫార్మెన్స్ మరియు 28% వేగవంతమైన మల్టీ కోర్ పెర్ఫార్మెన్స్ ను అందిస్తుంది. ఈ చిప్ సెట్ Armv9.2 CPU అడ్వాంటేజ్ అందించే ఏకైక చిప్ సెట్ కూడా ఇదే అవుతుంది.

ఈ మీడియాటెక్ కొత్త చిప్ సెట్ TSMC 3nm పై పని చేస్తుంది మరియు గొప్ప పవర్ సేవర్ గా కూడా ఉంటుంది. ఇది 40% వరకు అధిక పవర్ సేవింగ్ చేస్తుందని మీడియాటెక్ చెబుతోంది. ఈ చిప్ సెట్ LPDDR5X 10667 కి సపోర్ట్ చేస్తుంది. అంటే, ఇది అత్యంత వేగవంతమైన స్మార్ట్ ఫోన్ మెమరీ కేపబిలిటీకి భరోసా ఇస్తుంది.

MediaTek Dimensity 9400

ఇక ఈ ఫోన్ GPU మరియు ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ చిప్ సెట్ Arm యొక్క 5th జెనరేషన్ Immortalis G925 GPU తో జతగా ఉంటుంది. ఇది గొప్ప గేమింగ్ కోసం గొప్ప గ్రాఫిక్స్ ప్రోసెసింగ్ ను అందిస్తుంది మరియు మరింత వేగవంతమైన గేమింగ్ పెర్ఫార్మెన్స్ కోసం సహాయ పడుతుంది. అంతేకాదు, ఈ చిప్ సెట్ MediaTek Adaptive Gaming Technology 3.0 తో కూడా వస్తుంది.

ఇక అసలు విషయానికి వస్తే, ఈ చిప్ సెట్ Agentic AI Engine కలిగిన వరల్డ్ ఫస్ట్ చిప్ సెట్ గా నిలిచింది. ఇది అత్యంత హై క్వాలిటీ వీడియో కోసం సపోర్ట్ చేస్తుంది మరియు గేమింగ్ కూడా ఉత్తమైన క్వాలిటీ లో ఆస్వాదించవచ్చు. ఇది లాంగ్ కంటెంట్ సపోర్ట్, వేగవంతమైన LLM స్పీడ్ సపోర్ట్ మరియు మల్టి మోడాలిటీ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Also Read: Amazon Sale నుంచి భారీ డిస్కౌంట్ తో లభిస్తున్న Sony మరియు JBL హెడ్ ఫోన్స్ ఇవే.!

కెమెరా పరంగా, ఈ చిప్ సెట్ అద్భుతాలను క్రియేట్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ చిప్ సెట్ 4K వీడియోలు 60fps వద్ద తక్కువ బ్యాటరీ ఖర్చుతో షూట్ చేసే విదంగా ప్రాసెస్ చేస్తుంది. అలాగే, ఆటో ఫోకస్ తో లాస్ లెస్ HDR zoom కోసం కూడా ఇది సపోర్ట్ చేస్తుంది. Gen-AI Super Zoom సపోర్ట్ తో 100X జూమ్ ను అందిస్తుంది. అంతేకాదు, తీసిన ఫోటోలను AI తో ఏది చేసుకునే అవకాశం కూడా అందిస్తుంది. ఇది 320MP కెమెరా వరకు సపోర్ట్ చేస్తుంది మరియు 8K @ 60fps (7690 x 4320) వీడియో సపోర్ట్ తో కూడా వస్తుంది.

త్వరలోనే ఈ చిప్ సెట్ తో కొత్త ఫోన్ లు వచ్చే అవకాశం ఉండవచ్చు. ఇది ప్రీమియం ఫీచర్స్ కలిగిన చిప్ సెట్ కాబట్టి, ప్రీమియం ఫోన్స్ లో ఈ చిప్ సెట్ జతగా ఉండే అవకాశం ఉంటుంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo