18 లక్షల Mobile Number లను తొలగించనున్న ప్రభుత్వం.. ఎందుకంటే.!

18 లక్షల Mobile Number లను తొలగించనున్న ప్రభుత్వం.. ఎందుకంటే.!
HIGHLIGHTS

18 లక్షల Mobile Number లను తొలగించనున్న ప్రభుత్వం

ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది

దేశాన్ని పట్టి పీడిస్తున్న చాలా ఆన్లైన్ మోసాలకు ప్రభుత్వం చెక్ పెడుతుంది

దేశంలో రోజు రోజుకు పెరుగుతున్న ఆన్లైన్ మోసాలను అరికట్టడానికి ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే దేశంలో చాలా మంది యూజర్లు మోసపోయిన విషయం అందరికి తెలిసిందే. దీనికి ప్రధాన కారణంగా టెలీ కాలింగ్ లేదా మోసపూరితమైన మెసేజ్ వంటివి కన్పిస్తున్నాయి. అందుకే, ఇటువంటి మోసాలకు ఆస్కారమిచ్చే విధంగా కనిపించే నెంబర్ లపై ఆంక్షలు విధించే పనిలో పడింది.

18 లక్షల Mobile Number బ్లాక్ చేస్తుందా?

ప్రభుత్వం 18 లక్షల Mobile Number బ్లాక్ చేస్తుందా? అనే మాటకు నిజమే అనే సమాధానం చెబుతోంది ET. ఎందుకంటే, ET అందించిన కొత్త నివేదికలో ప్రభుత్వం 18 లక్షల మొబైల్ నెంబర్ లను తొలగించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపింది.

అంతేకాదు, ఈ నివేదికలో అనైతిక చర్యలకు పాల్పడుతున్న వారిపై ప్రభుత్వం తీసుకున్న కఠిన చర్యల లో భాగంగా ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు ఒక అధికారి తెలిపినట్లు కూడా వివరించింది. ఇదే కనుక నిజమైతే అధిక శాతం మోసాలకు పాల్పడుతున్న వారికి ముఖ్య ఆధారమైన లింక్ తెగిపోతుంది.

Mobile Number Blocked
Mobile Number Blocked

రిపోర్ట్ ద్వారా, మొబైల్ కనెక్షన్ ను సైబర్ క్రైం మరియు ఫైనాన్షియల్ మోసాలకు తప్పుగా ఉపయోగిస్తున్న వారిని అరికట్టేందుకు లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఈ యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: vivo X Fold3 Pro: ఇండియాలో మొదటి ఫోల్డ్ ఫోన్ లాంచ్ చేస్తున్న వివో.!

నేషనల్ సైబర్ రిపోర్టింగ్ పోర్టల్ (NCRP) ప్రకారం, 2023 లో సంవత్సరంలో దాదాపు రూ. 10,319 కోట్ల రూపాయల వరకూ బాధితులు కోల్పోయినట్లు కూడా గుర్తు చేసింది. బాధితుల నుండి అందుకున్న కంప్లైంట్స్ ఆధారంగా చేప్పట్టిన చర్యగా ఫలితాలు ఇందుకు దారితీసాయి.

అందుకే, అనుమానిత SIM కార్డు లను రీ వెరిఫికేషన్ ను టెలికాం కంపెనీలు నిర్వహిస్తాయి. 15 రోజుల్లో వీటిని పూర్తిగా రీ వెరిఫికేషన్ కు చేస్తుందని, వీటికి సహకరించని మొబైల్ కనెక్షన్ లను పూర్తిగా తొలగిస్తారు, అని ఈ రిపోర్టులో తెలిపింది.

ఇదే కనుక నిజమైతే త్వరలోనే దేశాన్ని పట్టి పీడిస్తున్న చాలా ఆన్లైన్ మోసాలకు ప్రభుత్వం చెక్ పెడుతుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ దిశగా చర్యలు తీసుకున్నట్లు కూడా ఈ నివేదిక ద్వారా తెలుస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo