రూ 2,399 కు మ్యాంగో మాన్ Teewe 2 స్ట్రీమింగ్ డాంగల్

రూ 2,399 కు మ్యాంగో మాన్ Teewe 2 స్ట్రీమింగ్ డాంగల్
HIGHLIGHTS

Teewe 2 స్ట్రీమింగ్ డాంగల్ తో అద్భుతమైన డేటా ఆఫర్స్ లభిస్తున్నాయి

Mango man కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ రూ 2,399 వద్ద Teewe 2 HDMI మీడియా స్ట్రీమింగ్ డాంగల్ ప్రారంభించింది. Teewe 2 కొరకు ముందుగా ఆర్డర్ www.teewe.in లో చేసుకోవచ్చు.  

మే 25, 2015 న www.amazon.in లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుంది. Teewe 2 తో స్మార్ట్ఫోన్, PC లేదా టాబ్లెట్ నుండి వీడియోలను, సంగీతం మరియు ఫోటోలు పెద్ద తేరపై స్ట్రీమ్ చేసుకోవచ్చు. డాంగల్ ను ఏదైనా TV / ప్రొజెక్టర్ లకు నేరుగా HDMI పోర్ట్ తో కనెక్ట్ చేసుకునే సదుపాయం ఉంది. సంస్థ ప్రకారం Teewe 2 చాలా అనువైనది మరియు దాని ముందు డివైజ్ కంటే పరిమాణం లో 30 శాతం తక్కువగా ఉంది. ఇది ఒక 1.6+ GHz డ్యూయల్ కోర్ ARM కార్టెక్స్ A9 ప్రాసెసర్ మరియు DDR 3 RAM 1 GB ఒక క్వాడ్ కోర్ GPU కలిసి పనిచేస్తుంది. ఇందులో ఒక మెరుగైన Wi-Fi చిప్ ఎటువంటి ల్యాగింగ్ లేకుండా కంటెంట్ ను ప్లే అయ్యేందుకు అనుమతిస్తుంది.

 

Mango man, ErosNow తో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. Teewe 2 వినియోగదారులకు ErosNow, తన ప్రీమియం చందా ను ఉచితంగా 2 నెలల ఇస్తుంది. దీనితో పాటు వినియోగదారులకు 3 నెలలు వరుసగా, ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ 60 GB డేటా ప్యాకేజీ ని ఉచితంగా నెలకు 20 GB చప్పున Teewe 2 అందింస్తుంది.  ప్రి ఆర్డర్ చేసుకునే కస్టమర్స్ కి కంపెని అదనంగా మరొక సంవత్సరం డివైజ్ మరియు డేటా సర్విసస్ పై వారంటి ఇవ్వనుంది.

అమెజాన్ ఆన్లైన్  స్టోర్ అధినేత, సమీర్ కుమార్, "మా సైటు ద్వారా వినియోగదారులకి Teewe 2 ను అందించటం ఆనందంగా ఉంది అని అన్నారు. మేము Amazon.in లో స్ట్రీమింగ్ మీడియా కు  డిమాండ్ గమనించాము. అలాగే మేము ఒక గొప్ప ఉత్పత్తి ని ఇండియాలో విడుదల చేసి, షాపింగ్ చేసుకునే సౌలభ్యత వినియోగదారులు అందించటం మంచి అవకాశం గా భావిస్తున్నాము." అని అన్నారు.

Silky Malhotra

Silky Malhotra

Silky Malhotra loves learning about new technology, gadgets, and more. When she isn’t writing, she is usually found reading, watching Netflix, gardening, travelling, or trying out new cuisines. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo