1GBPS స్పీడ్ తో – Li-Fi టెక్నాలజీ తో ఇండియాలో కొత్త LightUp డివైజ్ లాంచ్

1GBPS స్పీడ్ తో – Li-Fi టెక్నాలజీ తో ఇండియాలో కొత్త LightUp డివైజ్ లాంచ్

LukUp టెక్నాలజీస్ – ఇండియన్ కంపెని, "LightUp" ను లాంచ్ చేసింది. ఇది వైర్ లెస్ నెట్ వర్క్ ట్రాన్స్మీటర్. అంటే డేటా ను లైట్ తో transmit చేయటనికి పనిచేస్తుంది.

దీనిలో ఒక ప్రత్యేకత ఉంది. ఆ మధ్య చైనాలో కొత్తగా WiFi ను కనిపెట్టారు అని బాగా వార్తలు వినిపించాయి. దాని పేరు Li-Fi. ఈ LightUp Li-Fi తోనే డేటాను ట్రాన్స్ మిట్ చేస్తుంది.

మాక్సిమమ్ స్పీడ్ 1GB పర్ సెకెండ్. 4G లేదా ఫైబర్ కేబుల్ నెట్ వర్క్స్ కన్నా ఎక్కువ స్పీడ్ ఇస్తుంది. లాబరేటరీ టెస్ట్స్ లో ఇది 224GBPS ఇచ్చింది స్పీడ్.

ఈ టెక్నాలజీ ను మార్కెట్ లో విడుదల చేసిన మొదటి కంపెని ఇదే. పవర్ మరియు maintenance కూడా తక్కువ తీసుకుంటుంది అని చెబుతుంది కంపెని.

mid 2016 నుండి ఇది అందరికీ అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసుత్తం field టెస్ట్ లలో ఉంది. లాంచ్ డేట్ కాని ప్రైస్ కాని వెల్లడి కాలేదు ఇంకా.  హాకింగ్, హై రేడియేషన్ వంటి అనర్ధాలు కూడా దీనిలో ఉండవు..

Press Release
Digit.in
Logo
Digit.in
Logo