LG Stretchable Display ని ఎల్ జి ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత సాంప్రదాయ డిస్ప్లే మాదిరిగా కాకుండా మెలితిప్ప కలిగే లేదా సాగదీసే లాగా కూడా ఈ స్క్రీన్ ఉంటుంది. స్ట్రెచబుల్ డిస్ప్లే పేరుతో LG ఈ స్క్రీన్ ను ఆవిష్కరించింది. డిస్ప్లే రంగంలో ఇప్పటికే గొప్ప ఆవిష్కరణలు అందించిన ఎల్ జి ఇప్పుడు మరోక అడుగు ముందుకు వేసి ఈ కొత్త రకం డిస్ప్లే అందించింది.
ప్రపంచ డిస్ప్లే టెక్నాలజీ కేటగిరిలో లీడింగ్ ఇన్నోవేటర్ అయిన LG ఇప్పుడు కొత్త స్ట్రెచబుల్ డిస్ప్లే ని అనౌన్స్ చేసింది. ఈ స్క్రీన్ ట్విస్ట్, ఫోల్డ్ లేదా సాగదీసేలా, ఏ షేప్ లో అయినా పని చేసే ఈ కొత్త రకం డిస్ప్లే ని అందించింది. పెరుగుతున్న టెక్నాలజీ మరియు అవసరాల దృష్ట్యా ఈ స్క్రీన్ చాలా పనులకు ఉపయోగపడుతుంది అని LG తెలిపింది.
ఈ కొత్త డిస్ప్లే ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ కొత్త ప్రోటోటైప్ స్క్రీన్ 12 ఇంచెస్ పరిమాణంలో ఉంటుంది. అయితే, ఈ స్క్రీన్ 18 ఇంచెస్ వరకు సాగుతుంది. ఇంత సాగదీసినా ఈ స్క్రీన్ గొప్పగా పని చేస్తుందని కూడా LG పేర్కొంది. అంతేకాదు, ఈ డిస్ప్లే ని మెలిపెట్టవచ్చు మరియు వంచుకోవచ్చని కూడా కంపెనీ గొప్పగా చెబుతోంది.
ఈ కొత్త స్క్రీన్ 100 ppi హై రిజల్యూషన్ మరియు ఫుల్ RGB కలర్ సపోర్ట్ తో వస్తుంది. ఒక ప్రత్యేకమైన సిలికాన్ మెటీరియల్ మరియు వైరింగ్ డైజిన్ తో ఈ కొత్త రకం డిస్ప్లే ని నిర్మించడం వీలు పడిందని ఈ డిస్ప్లే నిర్మాణం గురించి LG తెలిపింది.
ఈ స్క్రీన్ లో 40μm (micrometers) లైట్ అందించే మైక్రో LED లైట్స్ ఉంటాయి మరియు ఇవి 10,000 టైమ్స్ స్ట్రెచ్ అయ్యే గుణాన్ని కలిగి ఉంటాయని కూడా ఎల్ జి పేర్కొంది. ఈ డిస్ప్లే కలిగిన ప్రత్యేకమైన గుణం కారణంగా బట్టలలో ఉపయోగించవచ్చు మరియు ఫ్యాషన్ రంగంలో గొప్ప మార్పు తీసుకు వస్తుందని కూడా తెలిపింది. అంతేకాదు, ఈ స్క్రీన్ ఆటోమోటివ్ ప్యానల్స్ వంటి మరిన్ని అవసరాలు మరియు ఎక్కడైనా ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తుందని ఈ స్క్రీన్ గురించి LG గొప్పగా చెబుతోంది.
Also Read: రూ. 4,000 ధరలో లభించే బెస్ట్ Soundbar Deals పై ఒక లుక్కేద్దామా.!
LG కొత్తగా ఆవిష్కరించిన ఈ స్ట్రెచబుల్ డిస్ప్లేలు అతి త్వరలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు మరియు నిపుణులు అంచనా వేస్తున్నారు.