LG Stretchable Display: కొత్త రకం డిస్ప్లే ని ఆవిష్కరించిన ఎల్ జి ఎలక్ట్రానిక్స్.!

LG Stretchable Display: కొత్త రకం డిస్ప్లే ని ఆవిష్కరించిన ఎల్ జి ఎలక్ట్రానిక్స్.!
HIGHLIGHTS

LG Stretchable Display ని ఎల్ జి ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది

మెలితిప్ప కలిగే లేదా సాగదీసే లాగా కూడా ఈ స్క్రీన్ ఉంటుంది

ఈ కొత్త ప్రోటోటైప్ స్క్రీన్ 12 ఇంచెస్ పరిమాణంలో ఉంటుంది

LG Stretchable Display ని ఎల్ జి ఎలక్ట్రానిక్స్ ఆవిష్కరించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత సాంప్రదాయ డిస్ప్లే మాదిరిగా కాకుండా మెలితిప్ప కలిగే లేదా సాగదీసే లాగా కూడా ఈ స్క్రీన్ ఉంటుంది. స్ట్రెచబుల్ డిస్ప్లే పేరుతో LG ఈ స్క్రీన్ ను ఆవిష్కరించింది. డిస్ప్లే రంగంలో ఇప్పటికే గొప్ప ఆవిష్కరణలు అందించిన ఎల్ జి ఇప్పుడు మరోక అడుగు ముందుకు వేసి ఈ కొత్త రకం డిస్ప్లే అందించింది. 

LG Stretchable Display

ప్రపంచ డిస్ప్లే టెక్నాలజీ కేటగిరిలో లీడింగ్ ఇన్నోవేటర్ అయిన LG ఇప్పుడు కొత్త స్ట్రెచబుల్ డిస్ప్లే ని అనౌన్స్ చేసింది. ఈ స్క్రీన్ ట్విస్ట్, ఫోల్డ్ లేదా సాగదీసేలా, ఏ షేప్ లో అయినా పని చేసే ఈ కొత్త రకం డిస్ప్లే ని అందించింది. పెరుగుతున్న టెక్నాలజీ మరియు అవసరాల దృష్ట్యా ఈ స్క్రీన్ చాలా పనులకు ఉపయోగపడుతుంది అని LG తెలిపింది.

ఈ కొత్త డిస్ప్లే ప్రత్యేకతల విషయానికి వస్తే, ఈ కొత్త ప్రోటోటైప్ స్క్రీన్ 12 ఇంచెస్ పరిమాణంలో ఉంటుంది. అయితే, ఈ స్క్రీన్ 18 ఇంచెస్ వరకు సాగుతుంది. ఇంత సాగదీసినా ఈ స్క్రీన్ గొప్పగా పని చేస్తుందని కూడా LG పేర్కొంది. అంతేకాదు, ఈ డిస్ప్లే ని మెలిపెట్టవచ్చు మరియు వంచుకోవచ్చని కూడా కంపెనీ గొప్పగా చెబుతోంది.

LG Stretchable Display

ఈ కొత్త స్క్రీన్ 100 ppi హై రిజల్యూషన్ మరియు ఫుల్ RGB కలర్ సపోర్ట్ తో వస్తుంది. ఒక ప్రత్యేకమైన సిలికాన్ మెటీరియల్ మరియు వైరింగ్ డైజిన్ తో ఈ కొత్త రకం డిస్ప్లే ని నిర్మించడం వీలు పడిందని ఈ డిస్ప్లే నిర్మాణం గురించి LG తెలిపింది. 

ఈ స్క్రీన్ లో 40μm (micrometers) లైట్ అందించే మైక్రో LED లైట్స్ ఉంటాయి మరియు ఇవి 10,000 టైమ్స్ స్ట్రెచ్ అయ్యే గుణాన్ని కలిగి ఉంటాయని కూడా ఎల్ జి పేర్కొంది.  ఈ డిస్ప్లే కలిగిన ప్రత్యేకమైన గుణం కారణంగా బట్టలలో ఉపయోగించవచ్చు మరియు ఫ్యాషన్ రంగంలో గొప్ప మార్పు తీసుకు వస్తుందని కూడా తెలిపింది. అంతేకాదు, ఈ స్క్రీన్ ఆటోమోటివ్ ప్యానల్స్ వంటి మరిన్ని అవసరాలు మరియు ఎక్కడైనా ఉపయోగించే వెసులుబాటు కల్పిస్తుందని ఈ స్క్రీన్ గురించి LG గొప్పగా చెబుతోంది.

Also Read: రూ. 4,000 ధరలో లభించే బెస్ట్ Soundbar Deals పై ఒక లుక్కేద్దామా.!

LG కొత్తగా ఆవిష్కరించిన ఈ స్ట్రెచబుల్ డిస్ప్లేలు అతి త్వరలో మార్కెట్ లోకి వచ్చే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు మరియు నిపుణులు అంచనా వేస్తున్నారు.                    

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo