Smartphone Camera Tips: బడ్జెట్ ఫోన్ తో కూడా సూపర్ ఫోటోల అందించే బెస్ట్ టిప్స్.!

Smartphone Camera Tips: బడ్జెట్ ఫోన్ తో కూడా సూపర్ ఫోటోల అందించే బెస్ట్ టిప్స్.!
HIGHLIGHTS

బడ్జెట్ ఫోన్ తో కూడా సూపర్ ఫోటోల అందించే బెస్ట్ టిప్స్

చిన్న టిప్స్ పాటిస్తే బడ్జెట్ ఫోన్లలో కూడా మంచి ఫోటోలు పొందవచ్చు

స్మార్ట్ ఫోన్లతో కూడా మంచి ఫోటోలను అందుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ టిప్స్

Smartphone Camera Tips: స్మార్ట్ ఫోన్ కెమేరాతో మంచి ఫోటోలను తియ్యాలని మరియు అందరి మెప్పు పొందాలని ప్రతీ ఒక్కరూ అనుకుంటారు. అయితే, ప్రతిసారి కూడా అనుకున్న విధంగా ఫోటోలను పొందలేకపోవచ్చు. దీనికి కారణం కేవలం తక్కువ రేట్ లో వచ్చిన ఫోను లేదా ఇంకా ఏదైనా కారణమని సరిపెట్టుకోవచ్చు. ప్రీమియం స్మార్ట్ ఫోన్లలో ముందు నుండే మంచి ఫీచర్లు అందుతాయి కాబట్టి గొప్ప ఫోటోలను అందుకునే అవకాశం ఉంటుంది. కానీ, చిన్న చిన్న టిప్స్ పాటిస్తే బడ్జెట్ ఫోన్లలో కూడా మంచి ఫోటోలు పొందవచ్చు.

అందుకే, బడ్జెట్ స్మార్ట్ ఫోన్లతో కూడా మంచి ఫోటోలను అందుకోవడానికి ఉపయోగపడే బెస్ట్ టిప్స్ ఈరోజు మనం చూడబోతున్నాం. అన్ని విషయాల గురించి కూలంకషంగా చర్చిద్దాం.

Smartphone Camera Tips
Smartphone Camera Tips

Clean the Lens

ఎందుకంటే ముందుగా ఈ ఫోన్ యొక్క కెమేరా లెన్స్ ను శుభ్రం చేయండి. ఎందకంటే, లెన్స్ పైన ఏవైనా చిన్న మరక ఉన్నా కూడా ఫోటోలు బ్లర్ గా కనిపిస్తాయి.

కెమేరా Settings అర్ధం చేసుకోండి

బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తో కూడా గొప్ప ఫోటోలను పొందాలంటే మీ ఫోన్ కెమేరా సెట్టింగ్ లను ముందుగా అర్ధం చేసుకోండి. exposure, white balance, ISO మరియు shutter speed వంటి సెట్టింగ్ లను అర్ధం చేసుకొని సరి చెయ్యడం ద్వారా గొప్ప ఫోటోలను పొందవచ్చు.

HDR Mode

ఫోన్ లలో కొత్తగా అందివచ్చిన HDR Mode (High Dynamic Range) ను ఉపయోగించండి. ఈ మోడ్ తో ఎక్కువ బ్రైట్ మరియు షాడోలో ఎక్కువ బ్లాక్ తో పాటుగా ప్రకాశవంతమైన ఫోటోలను అందిస్తుంది.

Also Read: Gold Market Live: ఒకే పందాలో పరిగెడుతున్న గోల్డ్ రేట్.!

Portrait Mode తో ఎక్స్ పెరిమెంట్స్ చేయండి

బ్యాక్‌గ్రౌండ్‌ ను బ్లర్ చేసి గొప్ప ఫోటోలను మీ స్మార్ట్‌ ఫోన్ పోర్ట్రెయిట్ మోడ్ లేదా డెప్త్-ఆఫ్-ఫీల్డ్ ఎఫెక్ట్‌లను ఉపయోగించండి. ముఖ్యంగా పోర్ట్రెయిట్‌ మరియు క్లోజ్-అప్ షాట్స్ కోసం ఇది గొప్పగా ఉంటుంది.

Edit Your Photos

ఫోటోలు షూట్ చేయడం వరకూ అందరం చేస్తూ ఉంటాము. అయితే, ఫోటోలు తీసిన తర్వాత ఆ ఫోటోలను మరింత మెరుగుపరచడానికి ఫోన్ లోని ఎడిటింగ్ టూల్స్ ఉపయోగించండి. వీటి ద్వారా మీ ఫోటోలను చక్కగా ట్యూన్ చేయడానికి బ్రైట్నెస్, కాంట్రాస్ట్, శాచురేషన్ మరియు షార్ప్ నెస్ లను సర్దుబాటు చేయడం ద్వారా గొప్ప ఫోటోలను పొందవచ్చు.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo