గోల్డ్ మార్కెట్ ఈరోజు కూడా భారీగానే పెరుగుదలను చూసింది. ఇప్పటికే మార్కెట్ లో బంగారం మూడు నెలల గరిష్ఠాన్ని చేరుకున్న విషయం తెలిసిందే, ఇప్పుడు ఈరోజు పెరిగిన ధరతో 6 నెలల గరిష్ఠానికి బంగారం మార్కెట్ చేరుకుంది. ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే అందనంత ఎత్తులో బంగారం నిలబడిపోతుంది. ఇక ఈనెల ప్రారంభం నాటికీ ఉన్న గోల్డ్ మర్కెట్ మరియు ఈరోజు బంగారం ధరలను పరిశీలిస్తే గ్రాముకు 240 రూపాయల వరకు పెరిగింది. అంటే, తులానికి 2,400 రూపాయల పెరుగుదలను గోల్డ్ మార్కెట్ ఈ నెలలో చూసింది. ఇక ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ ఎలా కొనసాగుతోందో పరిశీలిద్దాం.
నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 48,000 రూపాయలుగా ఉండగా, ఈరోజు బంగారం ధర 750 రూపాయలు క్రిందకు దిగి, రూ.48,750 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు రూ.53,180 రూపాయల వద్ద కొనసాగుతోంది.
ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,180 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.53,180 గా ఉంది.
ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.48,900 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.53,350 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.49,500 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.54,000 గా ఉంది.
సూచన: ఇక్కడ మీకు అందించిన గోల్డ్ రేట్ అప్డేట్ అన్ని కూడా Live అప్డేట్ మరియు వీటిలో సమయాన్ని బట్టి కొత్త మార్పులు ఉంటాయి.