లాండ్ రోవర్ కార్ ను ఇకనుండి మీ స్మార్ట్ ఫోన్ తో కంట్రోల్ చేయవచ్చు
బయట నుండి స్మార్ట్ అప్లికేషన్ తో కారు ను డ్రైవ్ చేయగలరు
Jaguar లాండ్ రోవర్ UK బేస్డ్ రీసర్చ్ టీమ్ లాండ్ రోవర్ ను సన్నని మరియు ఎత్తు పలాలు ఉన్న రోడ్ పై కారు బయట ఉండి డ్రైవ్ చేస్తూ కొన్ని డెమాన్స్ట్రేషన్స్ చూపించింది. కార్నర్స్ లో కూడా చాలా సునాయాసంగా నడిచింది లాండ్ రోవర్.
పార్కింగ్ లాట్ లో రివర్స్ డ్రైవింగ్ కూడా చేసి చూపించారు లాండ్ రోవర్ బృందం. కారు లోపల కాకుండా బయట ఉండి స్మార్ట్ ఫోన్ లోని యాప్ సహాయంతో ఈ అవుట్ సైడ్ డ్రైవింగ్ చేసి చూపించారు.
అయితే ఈ టెక్నాలజీ ఇంకా ప్రోటోటైప్ స్టేజ్ లో ఉంది. కార్ స్మార్ట్ కీ లోని కొన్ని సేన్సార్స్ సహాయంతో ఇది పనిచేస్తుంది. పార్కింగ్ లాట్స్ లోని కార్స్ అన్నీ డోర్ కూడా తీయలేనంత దగ్గరగా పార్క్ చేసినప్పుడు కార్ కు పది మీటర్లు దూరంలో ఉండి ఫోన్ తో కార్ ను బయటకు డ్రైవ్ చేయవచ్చు.
ఈ టెక్నాలజీ తో కార్ స్టీరింగ్, throttle, బ్రేకింగ్ మరియు హై నుండి లో రెంజేస్ లో షిఫ్టింగ్ వంటి కంట్రోల్స్ చేయగలము. లాండ్ రోవర్ మల్టీ పాయింట్ టర్న్ టెక్నాలజీ పై కూడా పనిచేస్తుంది.
ఇది కార్ ను 180 డిగ్రీ లలో టర్న్ చేసి వ్యతిరేక దిశలో ప్రయాణించగలదు. ఇది ట్రాఫిక్ సమస్యలకు మరియు రోడ్ లిమిటేషన్స్ లో బాగా ఉపయోగపడుతుంది.