Gold Rate Update: ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి.!!

Gold Rate Update: ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి.!!
HIGHLIGHTS

రెండు రోజులుగా డౌన్ ట్రేడ్ చేస్తున్న గోల్డ్ మార్కెట్

ఈరోజు గోల్డ్ మార్కెట్ స్వల్పంగా పెరుగుదలను చూసింది

బంగారం ధర ఇప్పటికీ 6 నెలల కనిష్ఠం వద్దనే కొనసాగుతోంది

Gold Rate: ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి. గత రెండు రోజులుగా గోల్డ్ మార్కెట్ డౌన్ ట్రేడ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే, ఈరోజు గోల్డ్ మార్కెట్ స్వల్పంగా పెరుగుదలను చూసింది. ఈరోజు గ్రాముకు 30 రూపాయల చొప్పున గోల్డ్ మార్కెట్ సూచీలు పైకి ఎగబాకాయి. అయినా కూడా బంగారం ధర ఇప్పటికీ 6 నెలల కనిష్ఠం వద్దనే కొనసాగుతోంది. అయితే, అంతర్జాతీయంగా కొనసాగుతున్న అనిశ్చిత కారణాల వలన గోల్డ్ రేట్ ఒడిదుడుకులను ఎందుర్కోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈరోజు గోల్డ్ రేట్ అప్డేట్ తెలుసుకోండి. 

Gold Rate Update:

నిన్న ప్రధాన మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,600 రూపాయలుగా ఉండగా, ఈరోజు 300 రూపాయల పెరుగుదలను నమోదు చేసి, గోల్డ్ ధర 46,300 రూపాయల వద్ద కొనసాగుతోంది. అలాగే, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర చూస్తే, ఈరోజు రూ.50,480 రూపాయల వద్ద కొనసాగుతోంది.

ఈరోజు బంగారం ధర

ఇక ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల బంగారం ధరల విషయానికి వస్తే, ఈరోజు హైదరాబాద్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,300 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,480 గా ఉంది. అలాగే, ఈరోజు విజయవాడలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,310 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,490 గా ఉంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ విషయానికి వస్తే, ఢిల్లీలో ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.46,750 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర రూ.50,950 గా ఉంది. ఈరోజు కూడా దేశంలోని అన్ని ప్రధాన ఇతర నగరాల కంటే చెన్నైలో బంగారం ధర ఎక్కువగా నమోదయ్యింది. ఈరోజు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.47,300 గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.51,600 గా ఉంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo