Gold Rate: ఏప్రిల్ 27 గోల్డ్ రేట్ఈ అప్డేట్ తెలుసుకోండి..!

Updated on 27-Apr-2023
HIGHLIGHTS

రెండు రోజులు వరుసగా పెరిగిన గోల్డ్ రేట్

గోల్డ్ మార్కెట్ ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది

ఏప్రిల్ 18 వ తేదీ ఉన్న రేటుకు దాదాపుగా సమానంగా కొనసాగుతోంది

రెండు రోజులు వరుసగా పెరిగిన తరువాత, గోల్డ్ మార్కెట్ ఈరోజు స్థిరంగా కొనసాగుతోంది. ఈరోజు గోల్డ్ రేట్ లో ఎటువంటి మార్పులు చోటు చేసుకో లేదు మరియు స్థిరంగా ఉన్నాయి. అంతేకాదు, ఈరోజు గోల్డ్ రేట్ ఏప్రిల్ 18 వ తేదీ ఉన్న రేటుకు దాదాపుగా సమానంగా కొనసాగుతోంది.  ఈ నెల  గోల్డ్ మార్కెట్ ను పరిశీలిస్తే మాత్రం తులానికి 1,300 రూపాయలు పైగా లాభాన్ని గోల్డ్ మార్కెట్ చూసింది. 

ఈ నెల గోల్డ్ రేట్ ఎలా వుంది?

ఈ నెల గోల్డ్ ఎలా వుంది అని చూస్తే, గోల్డ్ రేట్ ఈ నెల ఇప్పటి వరకూ రూ. 1,300 రూపాయలకు పైగా లాభాన్ని నమోదు చేసింది. ఈ నెల  ప్రారంభం లో రూ. 54,700 (22K గోల్డ్ 10గ్రా) వద్ద మొదలైన గోల్డ్ రేట్, రూ. 1,250 పెరిగి రూ. 55,950 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 24K గోల్డ్ రేట్ ను చూస్తే, రూ. 59,670 వద్ద మొదలైన గోల్డ్ రేట్ రూ. 1,370 రూపాయలు పెరిగి ఈరోజు రూ. 61,040 వద్ద కొనసాగుతోంది. 

ఈరోజు గోల్ గోల్డ్ రేట్ అప్డేట్ ఏమిటీ?

ఈరోజు గోల్డ్ రేట్ స్థిరంగా కొసాగుతోంది. ఈరోజు మార్కెట్ లో 10 గ్రా 22K గోల్డ్ రేట్ రూ. 55,950 వద్ద ముగియగా, 10గ్రా 24K గోల్డ్ రేట్ రూ. 61,040 వద్ద ముగిసింది. మొత్తంగా ఈరోజు గోల్డ్ రేట్ నిన్నటి ధర వద్దనే నిలకడగా కొనసాగుతోంది. 

హైదరాబాద్ & విజయవాడ  గోల్డ్ రేట్

ఈరోజు హైదరాబాద్ లో గోల్డ్ రేట్ ఎలా ఉన్నదని చూస్తే, ఒక తులం 22K పసిడి ధర రూ. 55,950 గా ఉంటే, 22K గోల్డ్ రేట్ రూ. 61,040 గా ఉన్నది. ఈరోజు విజయవాడ లో కూడా ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. 

గమనిక: ఇక్కడ గోల్డ్ లైవ్ మార్కెట్ ధరలు అందించడం జరిగింది. లోకల్ మార్కెట్ ధరకు ఈ ధరలకు వ్యత్యాసం ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :