ఒకే ఫోన్లో రెండు Whatsapp లను వాడడం ఎలాగో తెలుసుకోండి

ఒకే ఫోన్లో రెండు Whatsapp లను వాడడం ఎలాగో తెలుసుకోండి
HIGHLIGHTS

మీ ఫోన్లో డ్యూయల్ సిమ్లతో పాటుగా డ్యూయల్ Whatsapp ని కూడా వాడుకునే వీలుంటుంది.

ఈ రోజుల్లో, దాదాపుగా అన్ని స్మార్ట్  ఫోన్లు కూడా డ్యూయల్ సిమ్ కార్డుతో వస్తున్నాయి. ఈ రెండు నంబర్లకు గాను విడివిడి రెండు వాట్స్అప్ వాడుకునే వీలుంటే, మీరు మీకు నచ్చినట్లుగా విడివిడిగా చాట్ చేసుకోవచ్చు.  మీరు అలాగ డ్యూయల్ వాట్స్ఆప్ వాడనుకోవడానికి ప్రత్యేకంగా ఏవిధమైన ప్రయాస పడవలసిన అవసరంలేదు. మీరు వాడుతున్న ఫోన్లోనే ఈ ఎంపిక మీకు అందుబాటులో ఉంటుంది.

అయితే, అధికారకంగా రెండు వాట్స్అప్ లను వాడకూడదు కానీ, షావోమి, శామ్సంగ్, వివో, ఒప్పో, హువావే మరియు హానర్ వంటి కంపెనీలు ఇపుడు డ్యూయల్ ఆప్స్ లేదా డ్యూయల్ మోడ్ వంటి పేర్లతో ఫోన్లలో ఈ వెసులుబాటును కలిగిస్తున్నాయి. అంటే, మీరు ఒకేసారి రెండు నెంబర్లతో డ్యూయల్ వాట్స్అప్ వాడుకోవచ్చన్నమాట. ఏయే కంపెనీలు ఎలా వాటి డ్యూయల్ వాట్స్అప్ ని అందిస్తున్నాయో చుడండి.

షావోమి : డ్యూయల్ ఆప్ : సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు డ్యూయల్ ఆప్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి  

ఒప్పో  : క్లోన్ ఆప్ : సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు  క్లోన్ ఆప్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి

శామ్సంగ్ : డ్యూయల్ మేనేజర్ : సెట్టింగ్ లోపలి వెళ్ళండి తరువాత అడ్వాన్స్ ఫీచర్స్ లోకి వెళ్లి  డ్యూయల్ మేనేజర్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి

అసూస్  : ట్విన్ అప్స్  :  సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు ట్విన్ అప్స్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి

హువావే: ఆప్ ట్విన్   : సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు ఆప్ ట్విన్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి

హానర్    : ఆప్ ట్విన్   : సెట్టింగ్ లోపలి వెళ్ళండి మరియు ఆప్ ట్విన్ ఎంచుకున్నతరువాత వాట్స్ ఆప్ ఎనేబుల్ చేయండి

పైన తెలిపిన ప్రకారంగా, వాట్స్ఆప్ ఎనేబుల్ చేసినతరువాత  ఈ ప్రాసెస్ పూర్తియిన తరువాత హోమ్ స్క్రీన్లోకి వెళ్ళండి. అక్కడ కొత్తగా వచ్చినా వాట్స్ఆప్ రెండవ ఆప్ ని మీ మరొక మొబైల్ నెంబర్తో జోడించి వాడుకోవచ్చు.            

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo