బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లేదా ప్రీమియం ఫోన్ అయినాసరే, ప్రతి ఒక్కరూ వారి ఫోన్లను దాదాపుగాచేతిలో ఉంచుకుంటారు. కానీ అనుకోకుండా మీ ఫోన్ మీ చేతిలో నుండి స్లిప్ అయితే? అది క్రింద పడిపోతే స్క్రీన్కు నష్టం జరుగుతుంది. అయితే, కేవలం ఫోన్ అనుకోకుండా క్రిందపడటమే కాకుండా, ఇతర పరిస్థితుల కారణంగా కూడా ఫోన్ స్క్రీన్ పగిలిపోతుంటుంది.
ఫోన్ స్క్రీన్ను పరిష్కరించడానికి చాలా ఖర్చుచేయాల్సివస్తుంది. కానీ యూజర్ సహాయం కోసం కొన్ని సులువైన మార్గాలు ఉన్నాయి. ఇంట్లో కూర్చునే మీ ఫోనులో వచ్చిన గీతలను(క్రాక్స్) సరిచేసుకోవడం ఎలాగో తెలుసుకోండి.
ఫోన్ యొక్క గీతలను తొలగించడానికి, బేకింగ్ సోడా చక్కని పరిష్కారంగా ఉంటుంది. దీనికోసం మీరు రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా మరియు ఒక టేబుల్ స్పూన్ నీటిని తీసుకొని, ఒక చిక్కటి పేస్టులాగా తయారుచేసుకోవాలి. దీనిని ఒక పొడి వస్త్రంపై ఉంచండి మరియు ఏ వస్త్రంతో నెమ్మదిగా తెర గీతల పైన సుతిమెత్తగా రుద్దడం ద్వారా ఈ గీతలు (క్రాక్స్) తొలగించండి. దీనితో గీతలు కనిపించవు లేదా కాంతితో వెలుగులోకి వస్తుంది.
లేదంటే, ఈ పద్దతి ద్వారా మీ ఫోన్ స్క్రీన్ సరిదిద్దబడవచ్చు. దీని కోసం మీరు ఎక్కువగా శ్రమపడాల్సిన అవసరంలేదు, ఈ చిట్కాలలో మీరు కొంత టూత్ పేస్టు మీ వేలుపైన తీసుకోవాలి. తరువాత సెమీ సర్కిల్ ఆకారంలో మీ ఫోన్ స్క్రీన్ పైన నెమ్మదిగా దానితో రుద్దండి. దీని ద్వారా గీతలు మెరుస్తాయి లేదా అదృశ్యమవుతాయి.
ఎలాగోమరొక పద్దతి కూడా చేయొచ్చు. దీని కోసం మీకు ట్రాన్సపరెంట్ నెయిల్ పోలిష్ అవసరం. మీ ఫోన్ తెరపై ఫైన్ బ్రష్ తో క్రాక్స్ పైన పోలిష్ అప్ప్లై చేయండి మరియు అది పొడిగా అయ్యేవరకు వేచియుండండి. తరువాత, పొడి వస్త్రంపై కొద్దిగా వెజిటేబుల్ ఆయిల్ తీసుకొని స్క్రీన్ పైన తుడవండి. ఆ తరువాత, ఫోన్ స్క్రీన్ పాత మృదువైన బట్టతో శుభ్రం చేయండి.