ఒక కొత్త గ్యాస్ కనెక్షను పొందడం ఎంత సులభమో తెలుసుకోండి?

ఒక కొత్త గ్యాస్ కనెక్షను పొందడం ఎంత సులభమో తెలుసుకోండి?
HIGHLIGHTS

భారతదేశంలో, ఒక కొత్త LPG (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) కనెక్షన్ తీసుకోవడం గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకునే సమాచారం పొందడానికి

భారతదేశంలో, ఒక కొత్త LPG (లిక్విడ్ పెట్రోలియం గ్యాస్) కనెక్షన్ తీసుకోవడం గురించి ఇక్కడ పూర్తిగా తెలుసుకునే సమాచారం పొందడానికి . దీనికోసం, మీరు మొదటిగా అద్దె లేదా సొంత ఇంటిని కలిగి ఉండాలి. ఎల్.పి.జి. కనెక్షన్లు పొందడానికి భారతదేశంలో చాలామంది ఆందోళన చెందే అంశంగా భావిస్తారు. ఇక్కడ కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం పూర్తి గైడ్ ఉంది.

మీరు ఏమి చేయాలి:

1. మీ ప్రాంతంలో సమీప గ్యాస్ సంస్థ కార్యాలయంను తెలుసుకోండి.

2. ప్రతి ప్రాంతంలో, ఒక ప్రత్యేక ప్రాంతం కోసం సంస్థ ద్వారా సిలిండర్లను సరఫరా చేసే ఈ ఏజెన్సీ కార్యాలయం ఉంది.

3. గ్యాస్ ఏజెన్సీ ఆఫీస్ నుంచి కొత్త గ్యాస్ కనెక్షన్ కోసం దరఖాస్తు అప్లికేషన్ పొందండి.

4. అప్లికేషన్ తో మీ గుర్తింపు మరియు చిరునామా యొక్క పత్రాలను సమర్పించండి (జిరాక్స్ మాత్రమే).

5. నమోదు తర్వాత రిజిస్ట్రేషన్ మరియు రిజిస్ట్రేషన్ నంబరుతో మీ పేరును సంస్థ విడుదల చేస్తుంది.

6. మీ బుకింగ్ సంఖ్య వచ్చినప్పుడు, సంస్థ దాని గురించి కస్టమర్ సమాచారం ఇస్తుంది. కానీ కొన్ని ఏజెన్సీలు కొంత సమయం తీసుకుంటాయి.

7. కొన్ని దశలను పూర్తి చేయడనికి కొంత సమయం  పడుతుంది. ఆ సమయంలో, వినియోగదారులు నమోదు మరియు ఎల్పిజి నియంత్రకం / సిలిండర్ / డిపాజిట్ చెల్లింపులు చేయడం వంటివి అందుకుంటారు.

మీరు ఈ LPG కొరకు నమోదు చేయవలసిన పత్రాలు.

POI: ఓటరు ID, పాసుపోర్టు , డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు, మరేదైనా ప్రభుత్వం ఆమోద ఫోటో ఐడి.

POA: ఓటరు ID, పాసుపోర్టు, రేషన్ కార్డు, విద్యుత్ బిల్లులు (3 నెలల పాతవి), టెలిఫోన్ బిల్లులు (3 నెలల పాతవి), చెల్లిస్తున్న బిల్లులు, గృహ నమోదు బిల్లు, ఆధార్ లెటర్, ప్రభుత్వం ఆమోదం పొందిన ఇంటి  చిరునామా.

ఈ కొత్త LPG పొందడానికి ఖర్చు ఎంతవుతుంది!

– ఒక ఖాళీ సిలిండర్ ధర: 1450 / – రూపాయలు  (రిఫండబుల్ /తిరిగిపొందవచ్చు).

– ఫిల్డ్ సిలిండర్ ధర (14.2kg): ప్రాంతాన్నిబట్టి ఆధారపడివుంటుంది.

– ఒక రెగ్యులేటర్ ధర: 150 రూపాయలు (తిరిగి చెల్లించవలసిన / ఉపసంహరణ).

– గ్యాస్ పాస్ బుక్ ఖర్చు: 25 రూపాయలు.

– డాక్యుమెంటేషన్ ఫీజు: కంపెనీల నిర్ణయం.

– గ్యాస్ పొయ్యి ఖర్చు (ఆప్షనల్): గ్యాస్ పొయ్యి మోడల్ పైన ఆధారపడివుంటుంది.

సాధారణ LPG కనెక్షనుతో  మీరు ఏమి అందుకుంటారు?

– 14.2 కిలోల నిండిన LPG సిలిండర్

– ఒక రెగ్యులేటర్

– రబ్బరు గొట్టం

– గ్యాస్ పొయ్యి (అప్షనల్)

– గ్యాస్ చందాదారు యొక్క ఒక పాస్ బుక్

– గ్యాస్ చందాదారు సర్టిఫికెట్

భారతదేశంలో 3 ప్రముఖ గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి.

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (భారత్ గ్యాస్).

హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HP గ్యాస్).

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (Indane).

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo