Gold Rate: ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ ఎలా ఉందంటే | New Update
Gold Rate డౌన్ ట్రెండ్ తో మార్కెట్ లో భారీగా పడిపోయింది
ఇన్వెస్ట్ చేసే వారికి లాభాల బాట వేసిన గోల్డ్ ట్రేడింగ్
ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ వివరాలు తెలుసుకోండి
Gold Rate డౌన్ ట్రెండ్ తో మార్కెట్ లో భారీగా పడిపోయింది మరియు ప్రసుతం హాట్ టాపిక్ గా కూడా మారింది. గత నెల వరకూ గోల్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసే వారికి లాభాల బాట వేసిన గోల్డ్ ట్రేడింగ్, ప్రస్తుతం మధుపర్లకు నిద్రలేకుండా చేస్తోంది. కానీ, పసిడి కొనాలని చూస్తున్న కొనుగోలుదారులకు మాత్రం గొప్ప లాభసాటి మార్గంగా మారింది. మరి ఈరోజు గోల్డ్ మార్కెట్ అప్డేట్ వివరాలు తెలుసుకోండి.
Gold Rate Update
గత 10 రోజుల్లోనే 20 వేలకు పైగా తగ్గింది మరియు 60 వేల మార్క్ వద్ద కొనసాగుతున్న గోల్డ్ మార్కెట్ గత 10 రోజుల్లో 57 వేల రూపాయల మార్క్ వద్దకు చేరుకుంది. వాస్తవానికి, గోల్డ్ మార్కెట్ సెప్టెంబర్ నెల చివరి నుండే తళుకును కోల్పోవడం మొదలు పెట్టింది. సెప్టెంబర్ 25న గోల్డ్ రేట్ రూ. 59,950 రూపాయల వద్ద కొనసాగిన గోల్డ్ రేట్ ఈరోజు రూ. 57,230 రూపాయల వద్దకు చేరుకుంది.
అంటే, గడిచిన 12 రోజుల్లో మొత్తంగా బంగారం ధర రూ. 2,720 రూపాయలు క్రిందకు దిగజారింది. అయితే, రోజు రోజుకు క్రిందకు పడిపోతూ వచ్చిన గోల్డ్ మార్కెట్ ఈరోజు మాత్రం స్థిరంగా నిలిచింది.
Also Read: Amazon జబర్దస్త్ ఆఫర్: Lava Blaze 5G పైన భారీ డిస్కౌంట్ ఆఫర్|Big Deal
ఈరోజు 24 carat గోల్డ్ రేట్
ఈరోజు ప్రధాన మార్కెట్ లో 10 గ్రాముల 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ. రూ. 57,230 రూపాయల వద్ద క్లోజింగ్ నమోదు చేసింది.
ఈరోజు 22 carat గోల్డ్ రేట్
ఇక 10 గ్రాముల 22 క్యారెట్ ఆర్నమెంట్ బంగారం ధర విషయానికి వస్తే, ఈరోజు మార్కెట్ లో 10గ్రా 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ. 52,500 రూపాయల వద్ద క్లోజింగ్ ను నమోదు చేసింది.
ఈరోజు తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడ లతో పాటుగా దేశంలోని చాలా ప్రధాన నగరాలలో ఇదే రేటుతో గోల్ మార్కెట్ కొనసాగింది.
గమనిక: ఆన్లైన్ మరియు లోకల్ మార్కెట్ బంగారం ధరల్లో మార్పులు ఉంటాయి.