GOLD LIVE: ఈరోజు గోల్డ్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి.!
ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ దాదాపుగా స్థిరంగా నిలబడింది
గడిచిన నాలుగు రోజులతో పోలిస్తే గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిపెరిగింది
గోల్డ్ మార్కెట్ ఈరోజు స్వల్పంగా లాభాలతో ముగిసింది
GOLD LIVE: ఈరోజు మార్కెట్ లో గోల్డ్ రేట్ దాదాపుగా స్థిరంగా నిలబడింది. అయితే, గడిచిన నాలుగు రోజులతో పోలిస్తే గోల్డ్ రేట్ స్వల్పంగా పెరిపెరిగింది. ఏప్రిల్ 14 తరువాత క్రిందకు దిగడం మొదలుపెట్టిన గోల్డ్ మార్కెట్ ఈరోజు స్వల్పంగా లాభాలతో ముగిసింది. అంతేకాదు, నిన్న 60 మార్క్ దిగువన కొనసాగిన గోల్డ్ ధర ఈరోజు 61 వేల పైకి చేరుకుంది. ఈరోజు గోల్డ్ మార్కెట్ లేటెస్ట్ అప్డేట్ తెలుసుకోండి.
GOLD LIVE:
ఈరోజు గోల్డ్ మార్కెట్ రూ. 55,850 (10గ్రా-22K) రూపాయల వద్ద మొదలై 200 రూపాయల పెరుగుదలను చూసి రూ. 56,050 రూపాయల వద్ద కొనసాగుతోంది. అదేవిధంగా, రూ. 60,920 వద్ద ప్రారంభమైన 10గ్రాముల 24K గోల్డ్ రేట్ 230 రూపాయలు పెరిగి రూ. 61,150 వద్ద ముగిసింది.
అంటే, ఏప్రిల్ 14వ తేదీ తరువాత గోల్డ్ రేట్ ఈరోజు పెరుగుదలను నమోదు చేసింది.
ఢిల్లీ
ఈరోజు దేశరాజధాని ఢిల్లీ లో గోల్డ్ రేట్ ను చూస్తే, ఈరోజు 10 గ్రాముల 22K గోల్డ్ రేట్ రూ. 56,200 రూపాయలు కాగా, 10 గ్రాముల 24K బంగారం ధర రూ. 61,310 గా ఉంది.
ముంభై
ముంభై మార్కెట్ ఎప్పటి లాగానే ఈరోజు కూడా దేశంలో తక్కువ ధరను నమోదు చేసింది. ఈరోజు ముంభై లో 22K క్యారెట్ పసిడి ధర రూ. 56,030 గా ఉండగా, 10 గ్రాముల 24K పసిడి ధర రూ.61,130 గా ఉంది.
తెలుగు రాష్ట్రల ప్రధాన నగరాలైన హైదరాబాద్ మరియు విజయవాడలో బంగారం ధర వివరాలను క్రింద చూడవచ్చు.
హైదరాబాద్ & విజయవాడ
ఈరోజు హైదరాబాద్ మరియు విజయవాడ రెండు ప్రాంతాల్లో ఒకే ధర వద్ద గోల్డ్ మార్కెట్ కొనసాగుతోంది. ఈరోజు ఈ రెండు నగరాల్లో, ఒక తులం 22K బంగారం ధర రూ. 56,050 గా ఉండగా, ఒక తులం స్వచ్ఛమైన బంగారం ధర రూ. 61,150 వద్ద కొనసాగుతోంది.