ఒక్క ఫోన్ కాల్ తో మీ జేబు ఖాళీ చేస్తారు..ఎలాగంటే.!

Updated on 17-Mar-2023
HIGHLIGHTS

దేశంలో ఏదో ఒకమూల ఎక్కడో ఒక దగ్గర రోజూ ఏదో ఒకమోసం జరుగుతూనే ఉంటుంది

మోసానికి టెక్నాలజీ తోడైతే ఇది మరింత దారుణంగా ఉంటుంది

జెస్ట్ ఒక కాల్ చేసుకోవాలి అని ఫోన్ తీసుకొని మీ అకౌంట్ లో సింగిల్ పైసా లేకుండా దోచేస్తారు

దేశంలో ఏదో ఒకమూల ఎక్కడో ఒక దగ్గర రోజూ ఏదో ఒకమోసం జరుగుతూనే ఉంటుంది. అయితే, మోసానికి టెక్నాలజీ తోడైతే ఇది మరింత దారుణంగా ఉంటుంది. అటువంటిదే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే 'కాల్ స్కామ్'. ఇది కొత్త తరహా మరియు చాలా సులభం. జెస్ట్ ఒక కాల్ చేసుకోవాలి అని ఫోన్ తీసుకొని మీ అకౌంట్ లో సింగిల్ పైసా లేకుండా దోచేస్తారు. ఇప్పుడు స్కామర్లు వాడుతున్న కొత్త పంధా ఇదే. దీనికోసం సింపుల్ గా ఒక నంబర్ కు డయల్ చేస్తే సరిపోతుంది. 

అసలు ఏమిటి ఈ కొత్త Call Scam?

స్కామర్లు ప్రజల మంచితనాన్ని అదునుగా చేసుకొని ఈ కొత్త Call Scam ను అదునుగా చేసుకున్నారు. ఇందులో, స్కామర్లు అత్యవసరం చాలా అర్జెంటుగా కాల్ చేసుకోవాలి మీ ఫోన్ ఒక్కసారి ఇస్తారా? అని అడుగుతారు. మీరు ఫోన్ ఇచ్చినట్లయితే వారు వెంటనే *21* లేదా *401* కి కాల్ చేస్తారు. అంతే, ఇక్కడ నుండి మీ ఫోన్ కాల్స్ మరియు మెసేజీలు వారి నంబర్ కి ఫార్వార్డ్ అవుతాయి.         

Call Scam తో ఏమిటి ప్రమాధం?

పైన తెలిపి విధంగా మీ ఫోన్ మెసేజీలు మరియు కాల్స్ ఫార్వార్డ్ చేస్తే, మీ ఇంపార్టెంట్ మెసేజీలు (OTP లాంటివి) మరియు కాల్స్ మరిన్ని వివరాలు స్కామర్ల చేతిలోకి వెళ్లిపోతాయి. ఇంకేముంది మీ ఇన్ఫర్మేషన్ తో మీ జేబు ఖాళీ చేసేస్తారు.

మీ ఫోన్ లో ఇది ఎలా కనిపెట్టాలి?

మీకు తెలియకుండా మీ ఫోన్ లో ఎవరైనా కాల్ ఫార్వార్డింగ్ సెట్ చేశారో లేదో మీరు చాలా సులభంగా చెక్ చేయవచ్చు. దీనికోసం, మీ ఫోన్ నుండి *#62# లేదా *#67# నంబర్ కు డయల్ చేయగానే మీ ఫోన్ లో అన్ని వివరాలు చూడవచ్చు.

ఎలా నివారించాలి?

ఒకవేళ మీ ఫోన్ లో మీకు తెలియకుండా కాల్ ఫార్వార్డ్ సెట్ చేసినట్లయితే, మీరు  చాలా సులభంగా దాన్ని తొలగించవచ్చు. దీనికోసం, మీ ఫోన్ Settings లో Call > Call Forwarding లోకి వెళ్లి కాల్ ఫార్వార్డింగ్ అప్షన్ నుTurn Off చేయవచ్చు.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :